wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


దినవృత్తాంతములు మొదటి గ్రంథము చాప్టర్ 4
  • 1 యూదా కుమారులెవరనగా పెరెసు హెష్రోను కర్మీ హూరు శోబాలు.
  • 2 శోబాలు కుమారుడైన రెవాయా యహతును కనెను, యహతు అహూమైని లహదును కనెను, ఇవి సొరాతీయుల వంశములు.
  • 3 అబీయేతాము సంతతివా రెవరనగా యెజ్రెయేలు ఇష్మా ఇద్బాషు వీరి సహోదరి పేరు హజ్జెలెల్పోని.
  • 4 ​మరియు గెదోరీయులకు పితరుడగు పెనూయేలును హూషాయీయులకు పితరుడగు ఏజెరును, వీరు బేత్లెహేమునకు తండ్రియైన ఎఫ్రాతాకు జ్యేష్ఠుడగు హూరునకు కుమారులు.
  • 5 ​తెకోవ తండ్రియైన అష్షూరు నకు హెలా నయరా అను ఇద్దరు భార్యలుండిరి.
  • 6 నయరా అతనికి అహుజామును హెపెరును తేమనీని హాయ హష్తారీని కనెను. వీరు నయరాకు పుట్టిన కుమా రులు.
  • 7 ​హెలా కుమారు లెవరనగా జెరెతు సోహరు ఎత్నాను.
  • 8 ​కోజు ఆనూబును జోబేబాను హారుము కుమారుడైన అహర్హేలుయొక్క వంశములను కనెను.
  • 9 ​యబ్బేజు1 తన సహోదరులకంటె ఘనము పొందినవాడై యుండెను వేదనపడి యితని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరుపెట్టెను.
  • 10 ​యబ్బేజు ఇశ్రాయేలీ యుల దేవునిగూర్చి మొఱ్ఱపెట్టినీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాల పరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడురాకుండ దానిలోనుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవిచేసిన దానిని అతనికి దయచేసెను.
  • 11 షూవహు సహోదరుడైన కెలూబు ఎష్తోనునకు తండ్రియైన మెహీరును కనెను.
  • 12 ఎష్తోను బేత్రాఫాను పాసెయను ఈర్నాహాషునకు తండ్రియైన తెహిన్నాను కనెను, వీరు రేకావారు.
  • 13 కనజు కుమారులు ఒత్నీయేలు శెరాయా; ఒత్నీయేలు కుమారులలో హతతు అను ఒక డుండెను.
  • 14 ​మెయానొతై ఒఫ్రాను కనెను, శెరాయా పనివారి లోయలో నివసించువారికి తండ్రియైన యోవా బును కనెను, ఆ లోయలోనివారు పనివారై యుండిరి.
  • 15 యెఫున్నె కుమారుడైన కాలేబు కుమారులు ఈరూ ఏలా నయము; ఏలా కుమారులలో కనజు అను ఒకడుండెను.
  • 16 యెహల్లెలేలు కుమారులు జీఫు జీఫా తీర్యా అశర్యేలు.
  • 17 ఎజ్రా కుమారులు యెతెరు మెరెదు ఏఫెరు యాలోను; మెరెదు భార్య మిర్యామును షమ్మయిని ఎష్టెమోను వారికి పెద్దయయిన ఇష్బాహును కనెను.
  • 18 అతని భార్యయైన యెహూదీయా గెదోరునకు ప్రధానియైన యెరె దును శోకోకు ప్రధానియైన హెబెరును జానోహకు ప్రధానియైన యెకూతీయేలును కనెను. మెరెదు వివాహము చేసికొనిన ఫరో కుమార్తెయైన బిత్యాకు పుట్టిన కుమారులు వీరే.
  • 19 మరియు నహము సహోదరియైన హూదీయా భార్యయొక్క కుమారులెవరనగా గర్మీయు డైన కెయీలా మాయకాతీయుడైన ఎష్టెమో.
  • 20 షీమోను కుమారులు అమ్నోను రిన్నా బెన్హానాను తీలోను. ఇషీ కుమారులు జోహేతు బెన్జోహేతు.
  • 21 యూదా కుమారుడైన షేలహు కుమారులెవరనగా లేకాకు ప్రధానియైన ఏరు మారేషాకు ప్రధానియైన లద్దాయు; సన్నపు వస్త్రములు నేయు అష్బేయ యింటి వంశకులకును
  • 22 ​యోకీ మీయులకును కోజే బాయీయులకును యోవాషువారికిని మోయాబులో ప్రభుత్వము నొందిన శారాపీయులకును యాషూ బిలెహెమువారికిని అతడు పితరుడు; ఇవి పూర్వ కాలపు సంగతులే.
  • 23 ​వారు కుమ్మరివాండ్లయి నెతాయీము నందును గెదేరానందును కాపురముండిరి; రాజు నియమము చేత అతనిపని విచారించుటకై అచ్చట కాపురముండిరి.
  • 24 షిమ్యోను కుమారులు నెమూయేలు యామీను యారీబు జెరహు షావూలు.
  • 25 షావూలునకు షల్లూము కుమారుడు, షల్లూమునకు మిబ్శాము కుమారుడు, మిబ్శా మునకు మిష్మా కుమారుడు.
  • 26 మిష్మా కుమారులలో ఒకడు హమ్మూయేలు; హమ్మూయేలునకు జక్కూరు కుమారుడు, జక్కూరునకు షిమీ కుమారుడు.
  • 27 షిమీకి పదునారుగురు కుమారులును ఆరుగురు కుమార్తెలును కలిగిరి; అయితే అతని సహోదరులకు ఎంతో మంది కుమారులు కలుగలేదు; యూదావారు వృద్ధియైనట్లు వారి వంశములన్నియు వృద్ధికాలేదు.
  • 28 వారు బెయేర్షెబాలోను మోలాదాలోను హజర్షువలులోను
  • 29 బిల్హాలోను ఎజెములోను తోలాదులోను బెతూయేలులోను
  • 30 హోర్మాలోను సిక్లగులోను బేత్మర్కాబోతులోను హాజర్సూసాలోను బేత్బీరీలోను షరాయిములోను కాపురముండిరి.
  • 31 దావీదు ఏలుబడి వరకు వారు ఆ పట్టణములలో కాపురముండిరి.
  • 32 ఏతాము అయీను రిమ్మోను తోకెను ఆషాను అనువారి ఊళ్లు అయిదు.
  • 33 బయలువరకు ఆ పట్టణముల పొలములు వారి వశమున ఉండెను; ఇవి వారి నివాసస్థలములు, వంశావళి పట్టీలు వారికుండెను.
  • 34 వారు మెషోబాబు యమ్లేకు అమజ్యా కుమారుడైన యోషా,
  • 35 ​యోవేలు అశీయేలు కుమారుడైన శెరాయాకు పుట్టిన యోషిబ్యా కుమారుడైన యెహూ.
  • 36 ఎల్యోయేనై యహకోబా యెషోహాయా అశాయా అదీయేలు యెశీమీయేలు బెనాయా;
  • 37 షెమయాకు పుట్టిన షిమీ కుమారుడైన యెదాయాకు పుట్టిన అల్లోను కుమారుడైన షిపి కుమారుడైన జీజా అనువారు.
  • 38 పేళ్లవరుసను వ్రాయబడిన వీరు తమతమ వంశములలో పెద్దలైయుండిరి; వీరి పితరుల యిండ్లు బహుగా వర్ధిల్లెను.
  • 39 వీరు తమ మందలకొరకు మేత వెదకుటకై గెదోరునకు తూర్పుననున్న పల్లపుస్థలమునకు పోయి
  • 40 మంచి బలకరమైన మేతయు నెమ్మదియు సుఖమునుగల విశాలదేశమును కనుగొనిరి; పూర్వ మందు హాముయొక్క వంశపువారు అక్కడ కాపుర ముండిరి.
  • 41 పేళ్లవరుసను వ్రాయబడియుండు వీరు యూదా రాజైన హిజ్కియా దినములలో అచ్చటికి వచ్చి అచ్చట కనబడినవారి గుడారములను నివాసస్థలములను పడగొట్టి వారిని హతముచేసి, అచ్చట తమ గొఱ్ఱలకు తగిన మేత కలిగియుండుటచేత నేటివరకు వారి స్థానములను ఆక్రమించుకొని యున్నారు.
  • 42 షిమ్యోను కుమారులైన వీరిలో ఐదువందలమంది తమపైని ఇషీ కుమారులైన పెలట్యాను నెయర్యాను రెఫాయాను ఉజ్జీయేలును అధి పతులగా నిర్ణయించుకొని శేయీరు మన్నెమునకు పోయి
  • 43 అమాలేకీయులలో తప్పించుకొనిన శేషమును హతముచేసి నేటివరకు అచ్చట కాపురమున్నారు.