wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


దినవృత్తాంతములు మొదటి గ్రంథము చాప్టర్ 27
  • 1 జనసంఖ్యనుబట్టి ఇశ్రాయేలీయుల పితరుల యింటి .పెద్దలు సహస్రాధిపతులు శతాధిపతులు అనువారి లెక్కనుగూర్చినది, అనగా ఏర్పాటైన వంతుల విషయములో ఏటేట నెలవంతున రాజునకు సేవచేసినవారిని గూర్చినది. వీరి సంఖ్య యిరువది నాలుగు వేలు.
  • 2 ​మొదటి నెలను మొదటి భాగముమీద జబ్దీయేలు కుమారుడైన యాషాబాము అధిపతిగా ఉండెను; వాని భాగములో ఇరువది నాలుగు వేల మంది యుండిరి.
  • 3 ​పెరెజు సంతతి వారిలో ఒకడు మొదటి నెల సైన్యాధిపతులకందరికి అధిపతిగా ఉండెను.
  • 4 ​​రెండవ నెల వంతు అహోహీయుడైన దోదైదియు అతని భాగపువారిదియు ఆయెను; అతని భాగమందు మిక్లోతు అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
  • 5 మూడవ నెలను యెహోయాదా కుమారుడును సభాముఖ్యుడునగు బెనాయా అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
  • 6 ఈ బెనాయా ఆ ముప్పదిమంది పరాక్రమశాలులలో ఒకడై ఆ ముప్పది మందికి అధిపతియై యుండెను; అతని భాగమందు అతని కుమారుడైన అమీ్మజాబాదు ఉండెను.
  • 7 నాలుగవనెలను యోవాబు సహోదరుడైన అశాహేలు నాలుగవ అధిపతిగా ఉండెను; అతని కుమారుడైన జెబద్యా అతని తరువాత అధిపతియాయెను, అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
  • 8 అయిదవ నెలను ఇశ్రాహే తీయుడైన షవ్హుూతు అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
  • 9 ఆరవ నెలను తెకోవీయుడైన ఇక్కెషునకు పుట్టిన ఈరా అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
  • 10 ​ఏడవ నెలను ఎఫ్రాయిము సంతతివాడును పెలోనీయుడునైన హేలెస్సు అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
  • 11 ​ఎనిమిదవ నెలను జెరహీయుల సంబంధుడునుహుషాతీయుడునైన సిబ్బెకై అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
  • 12 ​తొమి్మదవ నెలను బెన్యామీనీయుల సంబంధుడును అనాతోతీయుడునైన అబీయెజెరు అధిపతిగా ఉండెను, అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
  • 13 ​పదియవ నెలను జెరహీయుల సంబంధుడును నెటోపా తీయుడునైన మహరై అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
  • 14 ​పదకొండవ నెలను ఎఫ్రాయిము సంతతివాడును పిరాతో నీయుడునైన బెనాయా అధిపతిగా ఉండెను, అతని భాగ ములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
  • 15 ​​పండ్రెండవ నెలను ఒత్నీయేలు సంబంధుడును నెటోపాతీయుడునైన హెల్దయి అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
  • 16 మరియు ఇశ్రాయేలీయుల గోత్రములమీదనున్నవారి వివరమేదనగా, జిఖ్రీ కుమారుడైన ఎలీయెజెరు రూబే నీయులకు అధిపతిగా ఉండెను, మయకా కుమారుడైన షెపట్య షిమ్యోనీయులకు అధిపతిగా ఉండెను,
  • 17 ​కెమూ యేలు కుమారుడైన హషబ్యా లేవీయులకు అధిపతిగా ఉండెను, సాదోకు ఆహరోనీయులకు అధిపతిగా ఉండెను.
  • 18 ​దావీదు సహోదరులలో ఎలీహు అను ఒకడు యూదావారికి అధిపతిగా ఉండెను, మిఖాయేలు కుమారు డైన ఒమీ ఇశ్శాఖారీయులకు అధిపతిగా ఉండెను,
  • 19 ​ఓబద్యా కుమారుడైన ఇష్మయా జెబూలూనీయులకు అధి పతిగా ఉండెను, అజ్రీయేలు కుమారుడైన యెరీమోతు నఫ్తాలీయులకు అధిపతిగా ఉండెను,
  • 20 ​అజజ్యాహు కుమారుడైన హోషేయ ఎఫ్రాయిమీయులకు అధిపతిగా ఉండెను, మనష్షే అర్ధగోత్రపువారికి పెదాయా కుమారు డైన యోవేలు అధిపతిగా ఉండెను,
  • 21 గిలాదులోనున్న మనష్షే అర్ధగోత్రపువారికి జెకర్యా కుమారుడైన ఇద్దో అధిపతిగా ఉండెను, బెన్యామీనీయులకు అబ్నేరు కుమారుడైన యహశీయేలు అధిపతిగా ఉండెను,
  • 22 దానీయు లకు యెరోహాము కుమారుడైన అజరేలు అధిపతిగా ఉండెను. వీరు ఇశ్రాయేలు గోత్రములకు అధిపతులు.
  • 23 ఇశ్రాయేలీయులను ఆకాశ నక్షత్రములంతమందిగా చేయుదునని యెహోవా సెలవిచ్చియుండెను గనుక ఇరువదియేండ్లు మొదలుకొని అంతకు తక్కువ వయస్సు గలవారిని దావీదు జనసంఖ్యయందు చేర్చలేదు.
  • 24 జన సంఖ్యచేయు విషయమున ఇశ్రాయేలీయులమీదికి కోపము వచ్చినందున సెరూయా కుమారుడైన యోవాబు దాని చేయనారంభించెనే గాని దాని ముగింపకపోయెను; కాబట్టి జనసంఖ్య మొత్తము దావీదు రాజు వృత్తాంత గ్రంథములలో చేర్చబడలేదు.
  • 25 రాజు బొక్కసములమీద అదీయేలు కుమారుడైన అజ్మావెతు నియమింపబడెను; అయితే పొలములలోను పట్టణములలోను గ్రామములలోను దుర్గములలోను ఉండు ఆస్తిమీద ఉజ్జియా కుమారుడైన యెహోనాతాను నియమింపబడెను.
  • 26 పొలములో పనిచేయువారిమీదను, భూమిదున్ను వారిమీదను కెలూబు కుమారుడైన ఎజ్రీ నియమింప బడెను.
  • 27 ద్రాక్షతోటలమీద రామాతీయుడైన షిమీయు, ద్రాక్షతోటల ఆదాయమైన ద్రాక్షారసము నిలువచేయు కొట్లమీద షిష్మీయుడైన జబ్దియు నియమింపబడిరి.
  • 28 ​షెఫేలా ప్రదేశముననుండు ఒలీవ చెట్లమీదను మేడిచెట్లమీదను గెదేరీయుడైన బయల్‌ హనాను నియమింపబడెను; నూనె కొట్లమీద యోవాషు నియమింపబడెను.
  • 29 షారోనులో మేయు పశువులమీద షారోనీయుడైన షిట్రయియు, లోయలలోని పశువులమీద అద్లయి కుమారుడైన షాపాతును నియమింపబడిరి.
  • 30 ఒంటెలమీద ఇష్మాయేలీయుడైన ఓబీలును, గాడిదలమీద మేరోనోతీ యుడైన యెహెద్యాహును నియమింపబడిరి.
  • 31 ​గొఱ్ఱల మీద హగ్రీయుడైన యాజీజు నియమింపబడెను. వీరందరు దావీదు రాజుకున్న ఆస్తిమీద నియమింపబడిన యధిపతులు.
  • 32 ​దావీదు పినతండ్రియైన యోనాతాను వివేకముగల ఆలోచనకర్తయై యుండెను గనుక అతడు శాస్త్రిగా నియమింపబడెను, హక్మోనీ కుమారుడైన యెహీయేలు రాజు కుమారులయొద్ద ఉండుటకు నియమింపబడెను.
  • 33 అహీతోపెలు రాజునకు మంత్రి, అర్కీయుడైన హూషై రాజునకు తోడు.
  • 34 అహీతోపెలు చనిపోయినమీదట బెనాయా కుమారుడైన యెహోయాదాయును అబ్యా తారును మంత్రులైరి; యోవాబు రాజుయొక్క సేనకు అధిపతిగా నియమింపబడెను.