- 1 యెహోవా సుడిగాలిచేత ఏలీయాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలీయాయు ఎలీ షాయు కూడి గిల్గాలునుండి వెళ్లుచుండగా
- 2 ఏలీయాయెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి యున్నాడు గనుక నీవు దయచేసి యిక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషాయెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి.
- 3 బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషాయొద్దకు వచ్చినేడు యెహోవా నీయొద్దనుండి నీ గురువును పరమునకు తీసికొని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడునేనెరుగు దును,మీరు ఊరకుండుడనెను.
- 4 పిమ్మట ఏలీయాఎలీషా, యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి యిక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు, నేను నిన్ను విడువననెను గనుక వారిద్దరు యెరికోకు ప్రయాణము చేసిరి.
- 5 యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషాయొద్దకు వచ్చినేడు యెహోవా నీయొద్ద నుండి నీ గురువును పరమునకు తీసికొని పోవునని నీ వెరుగు దువా అని ఎలీషాను అడుగగా అతడునేనెరుగుదును మీరు ఊరకుండుడ నెను.
- 6 అంతట ఏలీయాయెహోవా నన్ను యొర్దానునకు పొమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి యిక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడుయెహోవా జీవముతోడు నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పెను గనుక వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్లిరి.
- 7 ప్రవక్తల శిష్యులలో ఏబదిమంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరు యొర్దానునదిదగ్గర నిలిచిరి.
- 8 అంతట ఏలీయా తన దుప్పటి తీసికొని మడత పెట్టి నీటిమీద కొట్టగా అది ఇవతలకును అవతలకును విడి పోయెను గనుక వారిద్దరు పొడినేలమీద దాటిపోయిరి.
- 9 వారు దాటిపోయిన తరువాత ఏలీయా ఎలీషాను చూచినేను నీయొద్దనుండి తీయబడకమునుపు నీకొరకు నేనేమి చేయకోరుదువో దాని నడుగుమని చెప్పగా ఎలీషానీకు కలిగిన ఆత్మలో రెండుపాళ్లు నా మీదికి వచ్చు నట్లు దయచేయుమనెను.
- 10 అందుకతడునీవు అడిగినది కష్టతరముగా నున్నది; అయితే నీయొద్దనుండి తీయబడి నప్పుడు నేను నీకు కనబడినయెడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడనియెడల అది కాకపోవునని చెప్పెను.
- 11 వారు ఇంక వెళ్లుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుఱ్ఱములును కనబడి వీరిద్దరిని వేరు చేసెను; అప్పుడు ఏలీయా సుడిగాలిచేత ఆకాశమునకు ఆరోహణమాయెను
- 12 ఎలీషా అది చూచినా తండ్రీ నా తండ్రీ, ఇశ్రాయేలువారికి రథమును రౌతులును నీవే అని కేకలువేసెను; అంతలో ఏలీయా అతనికి మరల కన బడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని రెండు తునకలుగా చేసెను.
- 13 మరియు ఏలీయా దుప్పటి క్రింద పడగా అతడు దాని తీసికొని యొర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి
- 14 ఒంటిమీదినుండి క్రిందపడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటిమీద కొట్టిఏలీయాయొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయి నందున ఎలీషా అవతలి యొడ్డునకు నడిచిపోయెను.
- 15 యెరికోదగ్గరనుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతని చూచిఏలీయా ఆత్మ ఎలీషామీద నిలిచియున్నదని చెప్పుకొని, అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి
- 16 అతనితో ఇట్లనిరిఇదిగో నీ దాసులమైన మా యొద్ద ఏబదిమంది బలముగలవారున్నారు;మా మీద దయయుంచి నీ గురువును వెదకుటకు వారిని పోనిమ్ము; యెహోవా ఆత్మ అతనిని ఎత్తి యొక పర్వతము మీదనైనను లోయయందైనను వేసి యుండునేమో అని మనవి చేయగా అతడుఎవరిని పంపవద్దనెను.
- 17 అతడు ఒప్పవలసినంత బలవంతము చేసి వారతని బతిమాలగా అతడు పంపుడని సెలవిచ్చెను గనుక వారు ఏబదిమందిని పంపిరి. వీరు వెళ్లి మూడు దినములు అతనిని వెదకినను అతడు వారికి కనబడకపోయెను.
- 18 వారు యెరికో పట్టణమందు ఆగియున్న ఎలీషాయొద్దకు తిరిగి రాగా అతడువెళ్లవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అనెను.
- 19 అంతట ఆ పట్టణపువారుఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా యేలినవాడవైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు. అందుచేత భూమియు నిస్సారమై యున్నదని ఎలీషాతో అనగా
- 20 అతడుక్రొత్త పాత్రలో ఉప్పువేసి నాయొద్దకు తీసికొని రండని వారితో చెప్పెను. వారు దాని తీసికొని రాగా
- 21 అతడు ఆ నీటి ఊటయొద్దకు పోయి అందులో ఉప్పువేసి, యెహోవా సెలవిచ్చునదేమనగాఈ నీటిని నేను బాగు చేసి యున్నాను గనుక ఇక దీనివలన మరణము కలుగక పోవును. భూమియు నిస్సారముగా ఉండదు అనెను.
- 22 కాబట్టి నేటివరకు ఎలీషా చెప్పిన మాటచొప్పున ఆ నీరు మంచిదైయున్నది.
- 23 అక్కడనుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్లెను అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములోనుండి వచ్చిబోడివాడా ఎక్కిపొమ్ము, బోడివాడా ఎక్కిపొమ్మని అతని అపహాస్యము చేయగా
- 24 అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు రెండు ఆడు ఎలుగు బంట్లు అడవిలోనుండి వచ్చి వారిలో నలువది యిద్దరు బాలురను చీల్చి వేసెను.
- 25 అతడు అచ్చటనుండి పోయి కర్మెలు పర్వతమునకు వచ్చి అచ్చటనుండి పోయి షోమ్రోనునకు తిరిగివచ్చెను.
2 Kings 02
- Details
- Parent Category: Old Testament
- Category: 2 Kings
రాజులు రెండవ గ్రంథము చాప్టర్ 2