- 1 యొర్దాను ఇవతలనున్న అరణ్యములో, అనగా పారాను కును తోపెలు, లాబాను, హజేరోతు, దీజాహాబను స్థల ములకును మధ్య సూపునకు ఎదురుగానున్న ఆరాబాలో మోషే, ఇశ్రాయేలీయులందరితో చెప్పిన మాటలు ఇవే.
- 2 హోరేబునుండి శేయీరు మన్నెపుమార్గముగా కాదేషు బర్నేయవరకు పదకొండు దినముల ప్రయాణము.
- 3 హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహో నును అష్తారోతులో నివసించిన బాషాను రాజైన ఓగును ఎద్రెయీలో హతము చేసినతరువాత
- 4 నలుబదియవ సంవ త్సరములో పదకొండవ నెల మొదటి తేదిని మోషే ఇశ్రాయేలీయులకు బోధించుటకై యెహోవా తన కాజ్ఞా పించినదంతయు వారితో చెప్పెను.
- 5 యొర్దాను ఇవతలనున్న మోయాబు దేశమున మోషే యీ ధర్మశాస్త్రమును ప్రక టింప మొదలుపెట్టి ఇట్లనెను
- 6 మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఈలాగు సెలవిచ్చెను ఈ పర్వతము నొద్ద మీరు నివసించిన కాలము చాలును;
- 7 మీరు తిరిగి ప్రయాణమై అమోరీయుల మన్నెమునకును, అరాబా లోను, మన్నెములోను, లోయలోను, దక్షిణదిక్కున సముద్రతీరములోనున్న స్థలములన్నిటికిని, కనానుదేశము నకును, లెబానోనుకును, మహానదియైన యూఫ్రటీసువరకును2 వెళ్లుడి.
- 8 ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించితిని మీరు వెళ్లి యెహోవా మీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకును వారి తరువాత వారి సంతానమునకును ఇచ్చెదనని నేను ప్రమాణముచేసిన దేశమును స్వాధీన పరచుకొనుడి.
- 9 అప్పుడు నేనుఒంటరిగా మిమ్మును భరింపలేను.
- 10 మీ దేవుడైన యెహోవా మిమ్ము విస్తరింప జేసెను గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రములవలె విస్తరించి యున్నారు.
- 11 మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను వెయ్యి రెట్లు ఎక్కువచేసి, తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించునుగాక.
- 12 నేనొక్కడనే మీ కష్టమును మీ భారమును మీ వివాదమును ఎట్లు భరింపగలను?
- 13 జ్ఞానవివేకములు కలిగి, మీ మీ గోత్రము లలో ప్రసిద్ధిచెందిన మనుష్యులను ఏర్పరచుకొనుడి; వారిని మీమీద నియమించెదనని మీతో చెప్పగా
- 14 మీరునీవు చెప్పిన మాటచొప్పున చేయుట మంచిదని నాకు ఉత్తరమిచ్చితిరి.
- 15 కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ మీ గోత్రములలోని ముఖ్యులను పిలిపించుకొని, మీ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉండుటకై వెయ్యి మందికి ఒకడును, నూరుమందికి ఒకడును ఏబదిమందికి ఒకడును, పదిమందికి ఒకడును వారిని, మీమీద నేను నియమించితిని.
- 16 అప్పుడు నేను మీ న్యాయాధిపతులతోమీ సహోదరుల వ్యాజ్యెములను తీర్చి, ప్రతి మనుష్యుని కిని వాని సహోదరునికిని వానియొద్దనున్న పరదేశికిని న్యాయమునుబట్టి మీరు తీర్పు తీర్చవలెను.
- 17 తీర్పు తీర్చు నప్పుడు అల్పుల సంగతి గాని ఘనుల సంగతి గాని పక్ష పాతములేకుండ వినవలెను; న్యాయపుతీర్పు దేవునిదే. కాబట్టి మీరు మనుష్యుని ముఖము చూచి భయపడవద్దు. మీకు అసాధ్యమైన కఠినవ్యాజ్యెమును నాయొద్దకు తీసి కొని రావలెను; నేను దానిని విచారించెదనని వారి కాజ్ఞా పించితిని.
- 18 మరియు మీరు చేయవలసిన సమస్తకార్యము లను గూర్చి అప్పుడు మీకాజ్ఞాపించితిని.
- 19 మనము హోరేబునుండి సాగి మన దేవుడైన యెహోవా మనకాజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ ఘోరమైన మహా రణ్యములోనుండి వచ్చి, అమోరీ యుల మన్నెపు మార్గమున కాదేషు బర్నేయకు చేరితివిు.
- 20 అప్పుడు నేనుమన దేవు డైన యెహోవా మనకిచ్చుచున్న అమోరీయుల మన్నె మునకు వచ్చి యున్నాము.
- 21 ఇదిగో నీ దేవుడైన యెహోవా యీ దేశమును నీకు అప్పగించెను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాని స్వాధీనపరచు కొనుము, భయపడకుము, అధైర్యపడకుమని నీతో చెప్పి తిని.
- 22 అప్పుడు మీరందరు నాయొద్దకు వచ్చిమనకంటె ముందుగా మనుష్యులను పంపుదము; వారు మనకొరకు ఈ దేశమును వేగు జూచి, తిరిగి వచ్చి అందులోనికి మనము వెళ్లవలసిన త్రోవను గూర్చియు, మనము చేరవలసిన పురములను గూర్చియు మనకు వర్తమానము చెప్పుదు రంటిరి.
- 23 ఆ మాట మంచిదనుకొని నేను గోత్రమొక్కంటికి ఒక మనుష్యుని చొప్పున పన్నిద్దరు మనుష్యులను పిలి పించితిని.
- 24 వారు తిరిగి ఆ మన్నెమునకు పోయి ఎష్కోలు లోయకు వచ్చి దాని వేగుజూచి ఆ దేశఫలములను చేత పట్టుకొని
- 25 మనయొద్దకు తీసికొని వచ్చిమన దేవుడైన యెహోవా మన కిచ్చుచున్న దేశము మంచిదని మనకు తెలియ జెప్పిరి.
- 26 అయితే మీరు వెళ్లనొల్లక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరుగబడి
- 27 మీ గుడారము లలో సణుగుచుయెహోవా మనయందు పగపట్టినందున మనలను సంహరించునట్లు అమోరీయుల చేతికి మనలను అప్పగించుటకు ఐగుప్తుదేశములో నుండి మనలను రప్పించి యున్నాడు.
- 28 మనమెక్కడికి వెళ్లగలము? మన సహో దరులు అక్కడి జనులు మనకంటె బలిష్ఠులును ఎత్త రులునై యున్నారు; ఆ పట్టణములు గొప్పవై ఆకాశము నంటు ప్రాకారములతో నున్నవి; అక్కడ అనాకీయు లను చూచితిమని చెప్పి మా హృదయములను కరగజేసిరని మీరు చెప్పితిరి.
- 29 అప్పుడు నేను మిమ్మును చూచి దిగులు పడకుడి, వారికి భయపడకుడి,
- 30 మీకు ముందర నడుచు చున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నులయెదుట
- 31 ఐగుప్తులోను అరణ్యములోను మీకొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును, మీరు ఈ చోటికి చేరువరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తికొనునట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తికొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పితిని.
- 32 అయితే మీకు త్రోవ చూపించి మీ గుడా రములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచునట్లు
- 33 రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడి చిన మీ దేవుడైన యెహోవాయందు మీరు విశ్వాస ముంచలేదు.
- 34 కాగా యెహోవా మీరు చెప్పిన మాటలువిని
- 35 బహుగా కోపపడినేను మీ పితరులకిచ్చెదనని ప్రమాణము చేసిన యీ మంచి దేశమును ఈ చెడ్డతరము వారిలొ
- 36 యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవ డును చూడడు. అతడు పూర్ణమనస్సుతో యెహోవాను అనుసరించెను గనుక అతడు దానిని చూచును. అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతాన మునకును ఇచ్చెదనని ప్రమాణముచేసెను.
- 37 మరియు యెహోవా మిమ్మునుబట్టి నామీద కోపపడినీ పరిచారకు డగు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశిం చునుగాని నీవు దానిలో ప్రవేశింపవు.
- 38 అతడు ఇశ్రా యేలీయులు దాని స్వాధీనపరచుకొన చేయును గనుక అతని ధైర్యపరచుము.
- 39 ఆ దినమున మంచి చెడ్డలనెరుగని మీ కుమారులు, అనగా అపహరింప బడుదురని మీరు చెప్పిన మీ పిల్లలు దానిలో ప్రవేశింతురు; దానిని వారి కిచ్చెదను; వారు దానిని స్వాధీనపరచుకొందురు.
- 40 మీరు తిరిగి ఎఱ్ఱసముద్ర మార్గముగా అరణ్యమునకు ప్రయాణము చేయుడని చెప్పెను.
- 41 అందుకు మీరుమేము యెహో వాకు విరోధముగా పాపము చేసితివిు; మా దేవుడైన యెహోవా మా కాజ్ఞాపించిన మాటలన్నిటి ననుసరించి మేము పోయి యుద్ధము చేసెదమని నాతో ఉత్తర మిచ్చి, మీరందరు మీ ఆయుధములను కట్టుకొని, ఆలోచింపక ఆ మన్నెమునకు పోగా
- 42 యెహోవా నాతో ఇట్లనెనుయుద్ధమునకు పోకుడి; నేను మీ మధ్యనుండను గనుక వెళ్లకుడి; మీరు వెళ్లినను మీ శత్రువులయెదుట హతము చేయబడుదురని వారితో చెప్పుము.
- 43 ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరుగబడి మూర్ఖులై ఆ మన్నెమునకు వెళ్లితిరి.
- 44 అప్పుడు ఆ మన్నెములో నివసించిన అమోరీయులు మీకెదురుగా బయలుదేరి వచ్చి, కందిరీగలవలె మిమ్ము తరిమి హోర్మావరకు శేయీరులో మిమ్ము హతముచేసిరి.
- 45 తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని యేడ్వగా, యెహోవా మీ మొఱను లక్ష్యపెట్టలేదు, మీ మాట వినలేదు.
- 46 కాగా మీరు కాదేషులో బహు దినములు నివసించితిరి. మీరు నివసించిన దినములెన్నో మీకు తెలిసినవి.
Deuteronomy 01
- Details
- Parent Category: Old Testament
- Category: Deuteronomy
ద్వితీయోపదేశకాండమ చాప్టర్ 1