wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


ద్వితీయోపదేశకాండమ చాప్టర్ 14
  • 1 మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన వాడెవనినిబట్టి మిమ్మును మీరు కోసికొన కూడదు, మీ కనుబొమ్మల మధ్య బోడిచేసికొనకూడదు.
  • 2 ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్టిత జనము. మరియు యెహోవా భూమిమీద నున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను.
  • 3 నీవు హేయమైనదేదియు తినకూడదు. మీరు తిన దగిన జంతువులు ఏవేవనగా
  • 4 ​ఎద్దు, గొఱ్ఱపిల్ల, మేక పిల్ల,
  • 5 దుప్పి, ఎఱ్ఱ చిన్నజింక, దుప్పి, కారుమేక, కారుజింక, లేడి, కొండగొఱ్ఱ అనునవే.
  • 6 జంతువులలో రెండు డెక్కలు గలదై నెమరువేయు జంతువును తినవచ్చును.
  • 7 నెమరువేయువాటిలోనిదే కాని రెండు డెక్కలుగల వాటిలోనిదే కాని నెమరువేసి ఒంటిడెక్కగల ఒంటె, కుందేలు, పొట్టి కుందేలు అనువాటిని తినకూడదు. అవి మీకు హేయములు.
  • 8 మరియు పంది రెండు డెక్కలు గలదైనను నెమరువేయదు గనుక అది మీకు హేయము, వాటి మాంసము తినకూడదు, వాటి కళేబరములను ముట్ట కూడదు.
  • 9 నీట నివసించువాటన్నిటిలో మీరు వేటిని తినవచ్చు ననగా, రెక్కలు పొలుసులుగలవాటినన్నిటిని తినవచ్చును.
  • 10 రెక్కలు పొలుసులు లేనిదానిని మీరు తిన కూడదు అది మీకు హేయము.
  • 11 ​పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చును.
  • 12 ​మీరు తినరానివి ఏవనగాపక్షిరాజు,
  • 13 ​​పెద్ద బోరువ, క్రౌంచుపక్షి,
  • 14 పిల్లిగద్ద, గద్ద, తెల్లగద్ద,
  • 15 ప్రతి విధమైన కాకి,
  • 16 నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల,
  • 17 ప్రతి విధమైన డేగ, పైడికంటె,
  • 18 గుడ్లగూబ, హంస, గూడ బాతు,
  • 19 తెల్లబందు, చెరువుకాకి, చీకుబాతు, సారసపక్షి, ప్రతివిధమైన సంకుబుడికొంగ, కొంగ, కుకుడుగువ్వ, గబ్బిలము అనునవి.
  • 20 ఎగురు ప్రతి పురుగు మీకు హేయము; వాటిని తినకూడదు, పవిత్రమైన ప్రతి పక్షిని తిన వచ్చును.
  • 21 చచ్చినదానిని మీరు తినకూడదు. నీ యింట నున్న పరదేశికి దానిని ఇయ్యవచ్చును. వాడు దానిని తినవచ్చును; లేక అన్యునికి దాని అమ్మవచ్చును; ఏలయనగా నీ దేవు డైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. మేకపిల్లను దాని తల్లిపాలతో వండకూడదు.
  • 22 ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను.
  • 23 నీ దినము లన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకొనునట్లు నీ దేవుడైన యెహోవా తన నామము నకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలోగాని నీ ద్రాక్షారసములోగాని నీ నూనెలోగాని పదియవ పంతును, నీ పశువులలోగాని గొఱ్ఱ మేకలలోగాని తొలిచూలు వాటిని తినవలెను.
  • 24 మార్గము దీర్ఘముగానున్నందున, అనగా యెహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థలము మిక్కిలి దూరముగా నున్నందున, నీవు వాటిని మోయ లేనియెడల నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించు నప్పుడు, వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేత పట్టుకొని,
  • 25 నీ దేవుడైన యెహోవా యేర్పరచుకొను స్థలము నకు వెళ్లి నీవు కోరు దేనికైనను
  • 26 ఎద్దులకేమి గొఱ్ఱల కేమి ద్రాక్షారసమునకేమి మద్యమునకేమి నీవు కోరు దానికి ఆ వెండి నిచ్చి, అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనముచేసి, నీవును నీ యింటివారును నీ యింటనుండు లేవీయులును సంతోషింపవలెను.
  • 27 లేవీ యులను విడువ కూడదు; నీ మధ్యను వారికి పాలైనను స్వాస్థ్యమైనను లేదు.
  • 28 నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలోను నిన్ను ఆశీర్వదించునట్లు మూడేసి సంవత్సర ముల కొకసారి, ఆ యేట నీకు కలిగిన పంటలో పదియవ వంతంతయు బయటికి తెచ్చి నీ యింట ఉంచవలెను.
  • 29 అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్య మైనను లేని లేవీ యులును, నీ యింటనున్న పరదేశులును, తండ్రిలేనివారును, విధవరాండ్రును వచ్చి భోజనముచేసి తృప్తిపొందుదురు.