wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


ద్వితీయోపదేశకాండమ చాప్టర్ 16
  • 1 ఆబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కాపండుగ జరిగింపవలెను. ఏలయనగా ఆబీబునెలలో రాత్రివేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులొ నుండి నిన్ను రప్పించెను.
  • 2 ​యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనె నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి, గొఱ్ఱ మేకలలో గాని గోవులలోగాని బలి అర్పింపవలెను.
  • 3 ​పస్కా పండు గలో పొంగినదేనినైనను తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తుదేశములోనుండి వచ్చితివి గదా. నీవు ఐగుప్తు దేశ ములోనుండి వచ్చిన దినమును నీ జీవితములన్నిటిలో జ్ఞాప కము చేసికొనునట్లు, బాధను స్మరణకుతెచ్చు పొంగని ఆహారమును ఏడు దినములు తినవలెను.
  • 4 ​నీ ప్రాంతము లన్నిటిలో ఏడు దినములు పొంగినదేదైనను కనబడకూడదు. మరియు నీవు మొదటి తేది సాయంకాలమున వధించిన దాని మాంసములో కొంచెమైనను ఉదయమువరకు మిగిలి యుండ కూడదు.
  • 5 ​నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పురములలో దేనియందైనను పస్కా పశువును వధింప కూడదు.
  • 6 నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనే నీవు ఐగుప్తులోనుండి బయలుదేరి వచ్చినవేళను, అనగా సూర్యుడు అస్త మించు సాయంకాలమున పస్కా పశువును వధించి
  • 7 నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున దానిని కాల్చి భుజించి, ఉదయమున తిరిగి నీ గుడారములకు వెళ్లవలెను. ఆరు దినములు నీవు పొంగని రొట్టెలు తిన వలెను.
  • 8 ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు వ్రత దినము, అందులో నీవు జీవనోపాధియైన యేపనియు చేయ కూడదు.
  • 9 ఏడు వారములను నీవు లెక్కింపవలెను. పంట చేని పైని కొడవలి మొదట వేసినది మొదలుకొని యేడు వార ములను లెక్కించి
  • 10 ​నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వ దించినకొలది దాని నియ్యవలెను.
  • 11 అప్పుడు నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసి యును నీ గ్రామములలోనున్న లేవీయులును నీ మధ్య నున్న పరదేశులును తలిదండ్రులు లేనివారును విధవ రాండ్రును నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను.
  • 12 నీవు ఐగు ప్తులో దాసుడవై యుండిన సంగతిని జ్ఞాపకముచేసికొని, యీ కట్టడలను ఆచరించి జరుపుకొనవలెను.
  • 13 నీ కళ్లములోనుండి ధాన్యమును నీ తొట్టిలోనుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను ఏడు దినములు ఆచరింపవలెను.
  • 14 ఈ పండుగలో నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసి యును నీ గ్రామములలోనున్న లేవీయులును పరదేశు లును తలిదండ్రులు లేనివారును విధవరాండ్రును సంతో షింపవలెను.
  • 15 నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతిపను లన్నిటిలోను నిన్ను ఆశీర్వ దించును గనుక యెహోవా ఏర్పరచుకొను స్థలమును నీ దేవుడైన యెహోవాకు ఏడుదినములు పండుగ చేయ వలెను. నీవు నిశ్చయముగా సంతోషింపవలెను.
  • 16 ఏటికి మూడు మారులు, అనగా పొంగని రొట్టెలపండుగలోను వారములపండుగలోను పర్ణశాలల పండుగలోను నీ దేవు డైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ మగవారందరు ఆయన సన్నిధిని కనబడవలెను.
  • 17 వారు వట్టిచేతు లతో యెహోవా సన్నిధిని కనబడక, నీ దేవుడైన యెహోవా నీ కనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తికొలది యియ్యవలెను.
  • 18 నీ దేవుడైన యెహోవా నీ కిచ్చుచున్న నీ గ్రామము లన్నిటను నీ గోత్రములకు న్యాయాధిపతులను నాయ కులను నీవు ఏర్పరచుకొనవలెను. వారు న్యాయమును బట్టి జనులకు తీర్పుతీర్చవలెను.
  • 19 నీవు న్యాయము తప్పి తీర్పుతీర్చకూడదు; పక్షపాతము చేయకూడదు; లంచము పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కన్ను లకు గ్రుడ్డితనము కలుగజేయును నీతి మంతుల మాటలకు అపార్థము పుట్టించును.
  • 20 నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొను నట్లు కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకొన వలెను.
  • 21 నీ దేవుడైన యెహోవాకు నీవు కట్టు బలిపీఠము సమీ పమున ఏవిధమైన వృక్షమును నాటకూడదు, దేవతా స్తంభమును ఏర్పరచకూడదు.
  • 22 ​నీ దేవుడైన యెహోవా విగ్రహమును ద్వేషించువాడు గనుక నీవు ఏ స్తంభము నైన నిలువబెట్టకూడదు.