wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


ద్వితీయోపదేశకాండమ చాప్టర్ 27
  • 1 మోషేయు ఇశ్రాయేలీయుల పెద్దలును ప్రజలతో ఇట్లనిరినేడు నేను మీకు విధించుచున్న ధర్మమును మీరాచరింపవలెను.
  • 2 మీ దేవుడైన యెహోవా మీకిచ్చు చున్న దేశమున ప్రవేశించుటకు మీరు యొర్దాను దాటు దినమున మీరు పెద్దరాళ్లను నిలువ బెట్టి వాటిమీద సున్నము పూసి
  • 3 నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నీవు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పాలు తేనెలు ప్రవహించు దేశమున ప్రవేశించుటకు నీవు ఏరు దాటినతరువాత ఈ ధర్మ శాస్త్రవాక్యములన్నిటిని వాటిమీద వ్రాయవలెను.
  • 4 మీరు ఈ యొర్దాను దాటిన తరువాత నేను నేడు మీ కాజ్ఞాపించినట్లు ఈ రాళ్లను ఏబాలు కొండమీద నిలువబెట్టి వాటిమీద సున్నము పూయవలెను.
  • 5 అక్కడ నీ దేవుడైన యెహో వాకు బలిపీఠమును కట్టవలెను. ఆ బలిపీఠమును రాళ్లతో కట్టవలెను; వాటిమీద ఇనుప పనిముట్టు పడకూడదు.
  • 6 చెక్కని రాళ్లతో నీ దేవుడైన యెహోవాకు బలిపీఠమును కట్టి దానిమీద నీ దేవుడైన యెహోవాకు దహనబలుల నర్పింపవలెను.
  • 7 ​మరియు నీవు సమాధానబలుల నర్పించి అక్కడ భోజనము చేసి నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను.
  • 8 ​ఈ విధికి సంబంధించిన వాక్యము లన్నిటిని ఆ రాళ్లమీద బహు విశదముగా వ్రాయవలెను.
  • 9 ​మరియు మోషేయు యాజకులైన లేవీయులును ఇశ్రాయేలీయులందరితో ఇట్లనిరిఇశ్రాయేలీయులారా, మీరు ఊరకొని ఆలకించుడి.
  • 10 నేడు మీరు మీ దేవుడైన యెహోవాకు స్వజనమైతిరి గనుక మీ దేవు డైన యెహోవా మాట విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకొనవలెను.
  • 11 ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించిన దేమనగా మీరు యొర్దాను దాటినతరువాత షిమ్యోను లేవి యూదా ఇశ్శాఖారు యోసేపు
  • 12 బెన్యామీను గోత్ర ములవారు ప్రజలనుగూర్చి దీవెనవచనములను పలుకుటకై గెరిజీము కొండమీద నిలువవలెను.
  • 13 రూబేను గాదు ఆషేరు జెబూలూను దాను నఫ్తాలి గోత్రములవారు శాప వచనములను పలుకుటకై ఏబాలు కొండమీద నిలువ వలెను.
  • 14 అప్పుడు లేవీయులు యెహోవాకు హేయముగా శిల్పిచేతులతో
  • 15 మలి చిన విగ్రహమునేగాని పోతవిగ్రహమునేగాని చేసి చాటున నుంచువాడు శాపగ్రస్తుడని యెలుగెత్తి ఇశ్రా యేలీయులందరితోను చెప్పగాఆమేన్‌ అనవలెను.
  • 16 తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయు వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అన వలెను.
  • 17 తన పొరుగువాని సరిహద్దురాయిని తీసివేయు వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అనవలెను.
  • 18 గ్రుడ్డివాని త్రోవను తప్పించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అనవలెను.
  • 19 పరదేశికేగాని తండ్రిలేనివానికేగాని విధవరాలికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అనవలెను.
  • 20 తన తండ్రి భార్యతో శయనించువాడు తన తండ్రి కోకను విప్పినవాడు గనుక వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అనవలెను.
  • 21 ఏ జంతువుతోనైనను శయనించువాడు శాపగ్రస్తు డని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అనవలెను.
  • 22 తన సహోదరితో, అనగా తన తండ్రికుమార్తెతో గాని తన తల్లికుమార్తెతో గాని శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అనవలెను.
  • 23 తన అత్తతో శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అనవలెను.
  • 24 చాటున తన పొరుగువానిని కొట్టువాడు శాప గ్రస్తు డని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అనవలెను.
  • 25 నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచము పుచ్చు కొనువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అనవలెను.
  • 26 ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనక పోవుటవలన వాటిని స్థిరపరచనివాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అనవలెను.