- 1 తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోనుచూచిఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి.
- 2 ఫరోనేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయ ననెను.
- 3 అప్పుడు వారుహెబ్రీయుల దేవుడు మమ్మును ఎదుర్కొనెను, సెలవైన యెడల మేము అరణ్యములోనికి మూడు దినముల ప్రయాణమంత దూరముపోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుద
- 4 అందుకు ఐగుప్తు రాజుమోషే అహరోనూ, ఈ జనులు తమ పనులను చేయకుండ మీరేల ఆపు చున్నారు? మీ బరువులు మోయుటకు పొండనెను.
- 5 మరియు ఫరోఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించియున్నది; వారు తమ బరువులను విడిచి తీరికగా నుండునట్లు మీరు చేయుచున్నారని వారితో అనెను.
- 6 ఆ దినమున ఫరో ప్రజలపైనున్న కార్యనియామకులకును వారి నాయకులకును ఇట్లు ఆజ్ఞాపించెను
- 7 ఇటుకలు చేయుటకు మీరు ఇకమీదట ఈ జనులకు గడ్డి ఇయ్య కూడదు, వారు వెళ్లి తామే గడ్డి కూర్చుకొనవలెను.
- 8 అయినను వారు ఇదివరకు చేసిన యిటుకల లెక్కనే వారి మీద మోపవలెను, దానిలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు; వారు సోమరులు గనుకమేము వెళ్లి మా దేవునికి బలి నర్పించుటకు
- 9 ఆ మనుష్యులచేత ఎక్కువ పని చేయింపవలెను, దానిలో వారు కష్టపడవలెను, అబద్ధపుమాటలను వారు లక్ష్యపెట్టకూడదనెను.
- 10 కాబట్టి ప్రజలు కార్య నియామకులును వారి నాయకులును పోయి ప్రజలను చూచినేను మీకు గడ్డి ఇయ్యను;
- 11 మీరు వెళ్లి మీకు గడ్డి యెక్కడ దొరకునో అక్కడ మీరే సంపాదించు కొనుడి, అయితే మీ పనిలో నేమాత్రమును తక్కువ చేయబడదని ఫరో సెలవిచ్చెననిరి.
- 12 అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్య కాలు కూర్చుటకు ఐగుప్తు దేశమం దంతటను చెదిరి పోయిరి.
- 13 మరియు కార్యనియామకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటివలెనే యేనాటిపని ఆనాడే ముగించుడనిరి.
- 14 ఫరో కార్య నియామకులు తాము ఇశ్రాయేలీయులలో వారి మీద ఉంచిన నాయకులను కొట్టిఎప్పటివలె మీ లెక్క చొప్పున ఇటుకలను నిన్న నేడు మీరు ఏల చేయించలేదని అడుగగా
- 15 ఇశ్రాయేలీయుల నాయకులు ఫరో యొద్దకు వచ్చితమ దాసుల యెడల తమ రెందుకిట్లు జరిగించుచున్నారు?
- 16 తమ దాసులకు గడ్డినియ్యరు అయితే ఇటుకలు చేయుడని మాతో చెప్పుచున్నారు; చిత్తగించుము, వారు తమరి దాసులను కొట్టుచున్నారు; అయితే తప్పిదము తమరి ప్రజలయందే యున్నదని మొఱపెట్టిరి.
- 17 అందుకతడుమీరు సోమరులు మీరు సోమరులు అందుచేత మేము వెళ్లి యెహోవాకు బలినర్పించుటకు సెలవిమ్మని మీరడుగు చున్నారు.
- 18 మీరు పొండి, పనిచేయుడి, గడ్డి మీకియ్య బడదు, అయితే ఇటుకల లెక్క మీరప్పగింపక తప్పదని చెప్పెను.
- 19 మీ ఇటుకల లెక్కలో నేమాత్రమును తక్కువ చేయవద్దు, ఏనాటి పని ఆనాడే చేయవలెనని రాజు సెలవియ్యగా, ఇశ్రాయేలీయుల నాయకులు తాము దురవస్థలో పడియున్నట్లు తెలిసికొనిరి.
- 20 వారు ఫరో యొద్దనుండి బయలుదేరి వచ్చుచు, తమ్మును ఎదుర్కొను టకు దారిలో నిలిచియున్న మోషే అహరోనులను కలిసికొని
- 21 యెహోవా మిమ్ము చూచి న్యాయము తీర్చును గాక; ఫరో యెదుటను అతని దాసుల యెదుటను మమ్మును అసహ్యులనుగా చేసి మమ్ము చంపుటకై వారిచేతికి ఖడ్గ మిచ్చితిరని వారితో అనగా
- 22 మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్లిప్రభువా, నీవేల ఈ ప్రజలకు కీడు చేసితివి? నన్నేల పంపితివి?
- 23 నేను నీ పేరట మాటలాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటినుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు, నీ జనులను నీవు విడి పింపను లేదనెను.
Exodus 05
- Details
- Parent Category: Old Testament
- Category: Exodus
నిర్గమకాండము చాప్టర్ 5