- 1 మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోనును, అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలీయులలో నుండి నీ యొద్దకు పిలిపింపుము.
- 2 అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను.
- 3 అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతని ప్రతిష్ఠించుదువు. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేకహృదయులందరికి ఆజ్ఞ ఇమ్ము.
- 4 పతకము ఏఫోదు నిలువు టంగీ విచిత్ర మైన చొక్కాయి పాగా దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై యుండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను.
- 5 వారు బంగారును నీల ధూమ్ర రక్తవర్ణములుగల నూలును సన్ననారను తీసికొని
- 6 బంగారుతోను నీల ధూమ్ర రక్త వర్ణములుగల ఏఫోదును పేనిన సన్న నారతోను చిత్ర కారునిపనిగా చేయవలెను.
- 7 రెండు అంచులయందు కూర్చబడు రెండు భుజఖండములు దానికుండవలెను; అట్లు అది సమకూర్పబడియుండును.
- 8 మరియు ఏఫోదు మీదనుండు విచిత్రమైన దట్టి దాని పనిరీతిగా ఏకాండమైనదై బంగారుతోను నీలధూమ్ర రక్తవర్ణములుగల నూలుతోను పేనిన సన్ననారతోను కుట్టవలెను.
- 9 మరియు నీవు రెండు లేత పచ్చలను తీసికొని వాటిమీద ఇశ్రాయేలీయుల పేరులను, అనగా వారి జనన క్రమముచొప్పున
- 10 ఒక రత్నముమీద వారి పేళ్లలో ఆరును, రెండవ రత్నము మీద తక్కిన ఆరుగురి పేళ్లను చెక్కింపవలెను.
- 11 ముద్ర మీద చెక్కబడిన వాటివలె చెక్కెడివాని పనిగా ఆ రెండు రత్నములమీద ఇశ్రాయేలీయుల పేళ్లను చెక్కి బంగారు జవలలో వాటిని పొదగవలెను.
- 12 అప్పుడు ఇశ్రా యేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములనుగా ఆ రెండు రత్నములను ఏఫోదు భుజములమీద ఉంచవలెను అట్లు జ్ఞాపకముకొరకు అహరోను తన రెండు భుజములమీద యెహోవా స
- 13 మరియు బంగారు జవలను మేలిమి బంగారుతో రెండు గొలుసులను చేయవలెను;
- 14 సూత్రములవలె అల్లికపనిగా వాటిని చేసి అల్లిన గొలుసులను ఆ జవలకు తగిలింపవలెను.
- 15 మరియు చిత్రకారుని పనిగా న్యాయవిధాన పతకము చేయవలెను. ఏఫోదుపనివలె దాని చేయవలెను; బంగారు తోను నీల ధూమ్ర రక్తవర్ణములుగల నూలు తోను పేనిన సన్ననారతోను దాని చేయవలెను.
- 16 అది మడవబడి చచ్చౌకముగా నుండవలెను; అది జేనెడు పొడుగు జేనెడు వెడల్పుగలదై యుండవలెను.
- 17 దానిలో నాలుగు పంక్తుల రత్నములుండునట్లు రత్న ముల జవలను చేయవలెను. మాణిక్య గోమేధిక మరకతములుగల పంక్తి మొదటిది;
- 18 పద్మరాగ నీల సూర్యకాంతములుగల పంక్తి రెండవది;
- 19 గారుత్మతము యష్మురాయి ఇంద్రనీలములుగల పంక్తి మూడవది;
- 20 రక్తవర్ణపురాయి సులిమానిరాయి సూర్యకాంతములు గల పంక్తి నాలుగవది. వాటిని బంగారు జవలలో పొదగవలెను.
- 21 ఆ రత్నములు ఇశ్రాయేలీయుల పేరులుగలవై వారి పేరులచొప్పున పండ్రెండుండవలెను. ముద్రమీద చెక్కినవాటివలె వారిలో ప్రతివాని పేరు చొప్పున పండ్రెండు గోత్రముల పేరులు ఉండవలెను.
- 22 మరియు ఆ పతకము అల్లిక పనిగా పేనిన గొలుసులను మేలిమి బంగారుతో చేయవలెను.
- 23 పతకమునకు రెండు బంగారు ఉంగరములు చేసి
- 24 ఆ రెండు ఉంగరములను పతకపు రెండు కొసలయందు తగిలించి, పతకపు కొసలనున్న రెండు ఉంగరములలో అల్లబడిన ఆ రెండు బంగారు గొలుసులను తగిలింపవలెను.
- 25 అల్లిన ఆ రెండు గొలుసుల కొసలను రెండు రెండు జవలకు తగిలించి ఏఫోదు నెదుట దాని భుజములమీద కట్టవలెను.
- 26 మరియు నీవు బంగారుతో రెండు ఉంగరములను చేసి ఏఫోదు నెదుటనున్న పతకములోపలి అంచున దాని రెండు కొసలకు వాటిని తగిలింపవలెను.
- 27 మరియు నీవు రెండు బంగారు ఉంగర ములుచేసి ఏఫోదు విచిత్రమైన దట్టిపైగా దాని కూర్పు నొద్ద, దాని యెదుటి ప్రక్కకు దిగువను, ఏఫోదు రెండు భుజభాగములకు వాటిని తగిలింపవలెను.
- 28 అప్పుడు పతకము ఏఫోదు విచిత్రమైన దట్టికిపైగా నుండునట్లును అది ఏఫోదునుండి వదలక యుండునట్లును వారు దాని ఉంగర ములకు ఏఫోదు ఉంగరములకు నీలి సూత్రముతో పతకము కట
- 29 అట్లు అహరోను పరిశుద్ధస్థలములోనికి వెళ్లు నప్పుడు అతడు తన రొమ్ముమీద న్యాయవిధాన పతకములోని ఇశ్రాయేలీయుల పేళ్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెన
- 30 మరియు నీవు న్యాయవిధాన పతకములో ఊరీము తుమీ్మము అనువాటిని ఉంచ వలెను; అహరోను యెహోవా సన్నిధికి వెళ్లునప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలీయుల న్యాయవిధానమును నిత్యము భరించును.
- 31 మరియు ఏఫోదు నిలువుటంగీని కేవలము నీలిదారముతో కుట్టవలెను.
- 32 దానినడుమ తల దూరుటకు రంధ్రము ఉండవలెను. అది చినగకుండునట్లు కంఠ కవచ రంధ్రమువలె దాని రంధ్రముచుట్టు నేతపనియైన గోటు ఉండవలెను.
- 33 దాని అంచున దాని అంచులచుట్టు నీల ధూమ్ర రక్తవర్ణములుగల దానిమ్మ పండ్లను వాటి నడుమను బంగారు గంటలను నిలువు టంగీ చుట్టు తగిలింపవలెను.
- 34 ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మపండును ఆ నిలువు టంగీ క్రింది అంచున చుట్టు ఉండవలెను.
- 35 సేవచేయునప్పుడు అహరోను దాని ధరించుకొనవలెను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధస్థలములోనికి ప్రవేశించునప్పుడు అతడు చావకయుండునట్లు దాని ధ్వని వినబడవలెను.
- 36 మరియు నీవు మేలిమి బంగారు రేకుచేసి ముద్ర చెక్కునట్లు దానిమీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను.
- 37 అది పాగామీద ఉండునట్లు నీలి సూత్రముతో దాని కట్టవలెను. అది పాగా ముందటి వైపున ఉండవలెను.
- 38 తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు పరిశుద్ధ మైనవాటికి తగులు దోషములను అహరోను భరించునట్లు అది అహరోను నొసట ఉండవలెను; వారు యెహోవా సన్నిధిని అంగీక రింపబడునట్లు అది నిత్యమును అతని నొసట ఉండవలెను.
- 39 మరియు సన్న నారతో చొక్కాయిని బుట్టాపనిగా చేయవలెను. సన్న నారతో పాగాను నేయవలెను; దట్టిని బుట్టాపనిగా చేయవలెను.
- 40 అహరోను కుమారులకు నీవు చొక్కాయిలను కుట్టవలెను; వారికి దట్టీలను చేయవలెను; వారికి అలంకారమును ఘనతయు కలుగునట్లు కుళ్లాయిలను వారికి చేయవలెను.
- 41 నీవు నీ సహోదరు డైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలెను; వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకముచేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచ వలెను.
- 42 మరియు వారి మానమును కప్పుకొనుటకు నీవు వారికి నారలాగులను కుట్టవలెను.
- 43 వారు ప్రత్యక్షపు గుడారములోనికి ప్రవేశించునప్పుడైనను, పరిశుద్ధస్థలములో సేవచేయుటకు బలిపీఠమును సమీపించునప్పుడైనను, వారు దోషులై చావక యుండునట్లు అది అహరోనుమీదను అతని కుమారులమీదను ఉండవలెను. ఇది అతనికిని అతని తరువాత అతని సంతతికిని నిత్యమైన కట్టడ.
Exodus 28
- Details
- Parent Category: Old Testament
- Category: Exodus
నిర్గమకాండము చాప్టర్ 28