wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


యెహెజ్కేలు చాప్టర్ 34
  • 1 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
  • 2 నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరులనుగూర్చి ఈ మాట ప్రవచింపుము, ఆ కాపరు లతో ఇట్లనుముప్రభువగు యెహోవా సెలవిచ్చున దేమనగాతమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ; కాపరులు గొఱ్ఱలను మేపవలెను గదా.
  • 3 మీరు క్రొవ్విన గొఱ్ఱలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొఱ్ఱ లను మేపరు,
  • 4 బలహీనమైనవాటిని మీరు బలపరచరు, రోగముగలవాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరల తోలుకొనిరారు, తప్పిపోయినవాటిని వెదకరు, అది మాత్రమేగాక మీరు కఠినమనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు.
  • 5 కాబట్టి కాపరులు లేకయే అవి చెదరిపోయెను, చెదరి పోయి సకల అడవి మృగములకు ఆహారమాయెను.
  • 6 నా గొఱ్ఱలు పర్వతము లన్నిటిమీదను ఎత్తయిన ప్రతి కొండమీదను తిరుగులాడు చున్నవి, నా గొఱ్ఱలు భూమియందంతట చెదరిపోయినను వాటినిగూర్చి విచారించువాడొకడును లేడు, వెదకువా డొకడును లేడు.
  • 7 కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి
  • 8 కాపరులు లేకుండ నా గొఱ్ఱలు దోపుడుసొమ్మయి సకలమైన అడవిమృగములకు ఆహార మాయెను; కాపరులు నా గొఱ్ఱలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందురు గాని గొఱ్ఱలను మేపరు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
  • 9 కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించుడి.
  • 10 ప్రభు వైన యెహోవా సెలవిచ్చునదేమనగానా జీవముతోడు నేను ఆ కాపరులకు విరోధినైతిని, నా గొఱ్ఱలనుగూర్చి వారియొద్ద విచారించెదను, వారు గొఱ్ఱలు మేపుట మాన్పించెదను, ఇకను కాపరులు తమ కడుపు నింపుకొన జాలక యుందురు; నా గొఱ్ఱలు వారికి తిండికాకుండ వారి నోటనుండి వాటిని తప్పించెదను, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
  • 11 ప్రభువైన యెహోవా సెల విచ్చునదేమనగాఇదిగో నేను నేనే నా గొఱ్ఱలను వెదకి వాటిని కనుగొందును.
  • 12 తమ గొఱ్ఱలు చెదరిపోయి నప్పుడు కాపరులు వాటిని వెదకునట్లు నేను నా గొఱ్ఱ లను వెదకి, చీకటిగల మబ్బుదినమందు ఎక్కడెక్కడికి అవి చెదరిపోయెనో అక్కడనుండి నేను వాటిని తప్పించి
  • 13 ఆ యా జనులలోనుండి వాటిని తోడుకొని వచ్చి, ఆ యా దేశములలోనుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశము లోనికి వాటిని తెచ్చి పర్వతములమీదను వాగులయొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను.
  • 14 నేను మంచి మేతగలచోట వాటిని మేపె దను, ఇశ్రాయేలుయొక్క ఉన్నతస్థలములమీద వాటికి దొడ్డి యేర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండు కొనును, ఇశ్రాయేలు పర్వతములమీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును,
  • 15 నేనే నా గొఱ్ఱలను మేపి పరుండబెట్టుదును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
  • 16 తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలివేసిన దానిని మరల తోలుకొని వచ్చెదను, గాయపడినదానికి కట్టు కట్టు దును, దుర్బలముగా ఉన్నదానిని బలపరచుదును; అయితే క్రొవ్వినవాటికిని బలముగలవాటికిని శిక్షయను మేతపెట్టి లయపరచెదను.
  • 17 ​నా మందా, మీ విషయమై దేవుడనైన యెహోవానగు నేను సెలవిచ్చునదేమనగా గొఱ్ఱకును గొఱ్ఱకును మధ్యను, గొఱ్ఱలకును పొట్టేళ్ల కును మధ్యను, గొఱ్ఱలకును మేకపోతులకును మధ్యను భేదము కనుగొని నేను తీర్పుతీర్చెదను.
  • 18 విశేషముగా మేతమేసి మిగిలిన దానిని కాళ్లతో త్రొక్కుట మీకు చాలదా?
  • 19 మీరు స్వచ్ఛమైన నీరుత్రాగి మిగిలినదానిని కాళ్ళతో కలకలు చేయుట మీకుచాలదా? మీరు కాళ్లతో త్రొక్కినదానిని నా గొఱ్ఱలు మేయవలెనా? కాళ్లతో మీరు బురదగా కలిపినదానిని అవి త్రాగవలెనా?
  • 20 కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చు చున్నాడుఇదిగో నేను నేనే క్రొవ్విన గొఱ్ఱలకును చిక్కిపోయిన గొఱ్ఱలకును మధ్య భేదము కనుగొని తీర్పు తీర్చుదును.
  • 21 మీరు భుజముతోను ప్రక్కతోను త్రోసి, కొమ్ములతో రోగముగల వాటినన్నిటిని పొడిచి చెదర గొట్టెదరు.
  • 22 నా గొఱ్ఱలు ఇక దోపుడు కాకుండ గొఱ్ఱ కును గొఱ్ఱకును మధ్య తీర్పుతీర్చి నేను వాటిని రక్షించె దను.
  • 23 వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటిమీద కాపరినిగా నియమించెదను, అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును.
  • 24 యెహోవానైన నేను వారికి దేవుడనై యుందును, నా సేవకుడైన దావీదు వారిమధ్య అధిపతిగా ఉండును, యెహోవానైన నేను మాటయిచ్చియున్నాను.
  • 25 మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించునట్లును, అడవిలో నిర్భయముగా పండుకొనునట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును, దుష్టమృగములు దేశములో లేకుండ చేయు దును.
  • 26 వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను,దీవెనకరమగు వర్షములు కురియును,
  • 27 ఫలవృక్ష ములు ఫలములిచ్చును, భూమి పంట పండును, వారు దేశములో నిర్భయముగా నివసింతురు, నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసినవారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానైయున్నానని వారు తెలిసికొందురు.
  • 28 ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు, దుష్టమృగములు వారినిక భక్షింపవు, ఎవరివలనను భయము లేకుండ వారు సురక్షిత ముగా నివసించెదరు.
  • 29 మరియు వారు ఇక దేశములో కరవు కలిగి నశించిపోకుండను అన్యజనులవలన వారి కవ మానము ప్రాప్తించకుండను వారి ప్రఖ్యాతికొరకై తోట యొకటి నే నేర్పరచెదను.
  • 30 అప్పుడు తమ దేవుడైన యెహోవానగు నేను తమకు తోడుగా ఉన్నాననియు, ఇశ్రాయేలీయులైన తాము నా జనులైయున్నారనియు వారు తెలిసికొందురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
  • 31 నా గొఱ్ఱలును నేను మేపుచున్న గొఱ్ఱలు నగు మీరు మనుష్యులు, నేను మీ దేవుడను; ఇదే ప్రభు వైన యెహోవా వాక్కు.