- 1 శారా జీవించిన కాలము, అనగా శారా బ్రదికినయేండ్లు నూట ఇరువది యేడు.
- 2 శారా కనాను దేశమందలి హెబ్రోనను కిర్యతర్బాలో మృతిబొందెను; అప్పుడు అబ్రాహాము శారా నిమిత్తము అంగలార్చు టకును ఆమెను గూర్చి యేడ్చుటకును వచ్చెను.
- 3 తరువాత అబ్రాహాము మృతిబొందిన తన భార్య యెదుటనుండి లేచి హేతు కుమారులను చూచి
- 4 మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. మృతిబొందిన నా భార్య నా కన్నులయెదుట ఉండకుండ, ఆమెను పాతి పెట్టుటకు మీ తావున నా కొక శ్మశానభూమిని స్వాస్థ్యముగా ఇయ్యుడని అడుగ
- 5 హేతు కుమారులు అయ్యా మా మాట వినుము. నీవు మా మధ్యను మహారాజవై యున్నావు;
- 6 మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దానియందు మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టుము; నీవు మృతిబొందిన నీ భార్యను పాతి పెట్టునట్లు మాలో తన శ్మశానభూమి ఇయ్యనొల్లనివాడు ఎవడును లేడని అబ్రాహాము కుత్తరమిచ్చిరి.
- 7 అప్పుడు అబ్రాహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి
- 8 మృతిబొందిన నా భార్యను నా యెదుట ఉండకుండ నేను పాతి పెట్టుట మీకిష్టమైతే నా మాట వినుడి.
- 9 సోహరు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగియున్న మక్పేలా గుహను నాకిచ్చునట్లు నా పక్షముగా అతనితో మనవిచేయుడి. మీ మధ్యను శ్మశాన భూమిగా నుండుటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్థ్యముగా ఇయ్యవలెనని వారితో చెప్పెను.
- 10 అప్పుడు ఎఫ్రోను హేతు కుమారుల మధ్యను కూర్చుండి యుండెను. హిత్తీయుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించువారందరి యెదుట హేతు కుమారులకు వినబడు నట్లు అబ్రాహాముతో చె
- 11 అయ్యా అట్లు కాదు నా మనవి నాలకించుము, ఆ పొలమును నీకిచ్చుచున్నాను; దానిలోనున్న గుహను నీకిచ్చు చున్నాను; నా ప్రజల యెదుట అది నీకిచ్చుచున్నాను; మృతిబొందిన నీ భార్యను పాతి పెట్టు మనెన
- 12 అప్పుడు అబ్రాహాము ఆ దేశపు ప్రజల యెదుట సాగిలపడి
- 13 సరేకాని నా మనవి ఆలకించుము. ఆ పొలమునకు వెల యిచ్చెదను; అది నాయొద్ద పుచ్చు కొనినయెడల మృతిబొందిన నా భార్యను పాతి పెట్టెదనని ఆ దేశ ప్రజలకు వినబడు నట్లు ఎఫ్రోనుతో చెప్పెను.
- 14 అందుకు ఎఫ్రోను అయ్యా నా మాట వినుము; ఆ భూమి నాలుగు వందల తులముల వెండి చేయును;
- 15 నాకు నీకు అది యెంత? మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టుమని అబ్రాహామున కుత్తరమిచ్చెను;
- 16 అబ్రాహాము ఎఫ్రోను మాట వినెను. కాబట్టి హేతు కుమారులకు వినబడునట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు నాలుగు వందల తులముల వెండి అబ్రాహాము తూచి అతని కిచ్చెను.
- 17 ఆలాగున మమ్రే యెదుటనున్న మక్పేలా యందలి ఎఫ్రోను పొలము, అనగా ఆ పొలమును దానియందలి గుహయు దాని పొలిమేర అంతటి లోనున్న ఆ పొలము చెట్లన్నియు,
- 18 అతని ఊరి గవిని ప్రవేశించు వారందరిలో హేతు కుమారుల యెదుట అబ్రాహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను.
- 19 ఆ తరువాత అబ్రాహాము కనాను దేశములో హెబ్రోనను మమ్రేయెదుట నున్న మక్పేలా పొలము గుహలో తన భార్యయైన శారాను పాతిపెట్టెను.
- 20 ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతు కుమారులవలన శ్మశానముకొరకు అబ్రా హామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను.
Genesis 23
- Details
- Parent Category: Old Testament
- Category: Genesis
ఆదికాండము చాప్టర్ 23