- 1 అమ్మోనీయులనుగూర్చి యెహోవా ఈలాగు సెల... విచ్చుచున్నాడుఇశ్రాయేలునకు కుమారులు లేరా? అతనికి వారసుడు లేకపోయెనా? మల్కోము గాదును ఎందుకు స్వతంత్రించుకొనును? అతని ప్రజలు దాని పట్టణములలో ఎందుకు నివసింతురు?
- 2 కాగాయెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడురాగల దినములలో నేను అమ్మోనీయుల పట్టణమగు రబ్బా మీదికి వచ్చు యుద్ధము యొక్క ధ్వని వినబడజేసెదను; అది పాడుదిబ్బయగును, దాని ఉపపురములు అగ్నిచేత కాల్చబడును, దాని వారసులకు ఇశ్రాయేలీయులు వారసులగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
- 3 హెష్బోనూ, అంగ లార్చుము, హాయి పాడాయెను, మల్కోమును అతని యాజకులును అతని యధిపతులును చెరలోనికి పోవు చున్నారు; రబ్బా నివాసినులారా, కేకలువేయుడి, గోనెపట్ట కట్టుకొనుడి, మీరు అంగలార్చి కంచెలలో ఇటు అటు తిరుగులాడుడి.
- 4 విశ్వాసఘాతకురాలానా యొద్దకు ఎవడును రాలేడని నీ ధనమునే ఆశ్రయముగా చేసికొన్నదానా,
- 5 నీ లోయలో జలములు ప్రవహించు చున్నవని, నీవేల నీ లోయలనుగూర్చి యతిశయించు చున్నావు? ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
- 6 నేను నీ చుట్టునున్న వారందరివలన నీకు భయము పుట్టించు చున్నాను; మీరందరు శత్రువుని కెదురుగా తరుమబడు దురు, పారిపోవువారిని సమకూర్చు వాడొకడును లేక పోవును, అటుతరువాత చెరలోనున్న అమ్మోనీయులను నేను రప్పించెదను; ఇదే యెహోవా వాక్కు.
- 7 సైన్యములకధిపతియగు యెహోవా ఎదోమునుగూర్చి ఈలాగు సెలవిచ్చుచున్నాడు తేమానులో జ్ఞానమిక నేమియులేదా? వివేకులకు ఇక ఆలోచన లేకపోయెనా? వారి జ్ఞానము వ్యర్థమాయెనా?
- 8 ఏశావును విమర్శించుచు నేనతనికి కష్టకాలము రప్పించుచున్నాను; దదానీయు లారా, పారిపోవుడి వెనుకకు మళ్లుడి బహులోతున దాగు కొనుడి.
- 9 ద్రాక్షపండ్లు ఏరువారు నీయొద్దకు వచ్చిన యెడల వారు పరిగెలను విడువరా? రాత్రి దొంగలు వచ్చినయెడల తమకు చాలునంత దొరుకువరకు నష్టము చేయుదురు గదా?
- 10 నేను ఏశావును దిగంబరినిగా చేయు చున్నాను, అతడు దాగియుండకుండునట్లు నేనతని మరుగు స్థలమును బయలుపరచుచున్నాను, అతని సంతానమును అతని స్వజాతివారును అతని పొరుగువారును నాశన మగు చున్నారు, అతడును లేకపోవును.
- 11 అనాధులగు నీ పిల్లలను విడువుము, నేను వారిని సంరక్షించెదను, నీ విధవ రాండ్రు నన్ను ఆశ్రయింపవలెను.
- 12 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు న్యాయముచేత ఆ పాత్రలోనిది త్రాగను రానివారు నిశ్చయముగా దానిలోనిది త్రాగు చున్నారే, నీవుమాత్రము బొత్తిగా శిక్ష నొందకపోవుదువా? శిక్ష తప్పించుకొనక నీవు నిశ్చయముగా త్రాగుదువు.
- 13 బొస్రా పాడుగాను అపహాస్యాస్పదముగాను ఎడారి గాను శాపవచనముగాను ఉండుననియు, దాని పట్టణము లన్నియు ఎన్నటెన్నటికి పాడుగానుండుననియు నా తోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెల విచ్చుచున్నాడు.
- 14 యెహోవా యొద్దనుండి నాకు వర్త మానము వచ్చెను; జనముల యొద్దకు దూత పంపబడి యున్నాడు, కూడికొని ఆమెమీదికి రండి యుద్ధమునకు లేచి రండి.
- 15 జనములలో అల్పునిగాను మనుష్యులలో నీచునిగాను నేను నిన్ను చేయుచున్నాను.
- 16 నీవు భీకరు డవు; కొండసందులలో నివసించువాడా, పర్వత శిఖర మును స్వాధీనపరచుకొనువాడా, నీ హృదయగర్వము నిన్ను మోసపుచ్చెను, నీవు పక్షిరాజువలె నీ గూటిని ఉన్నత స్థలములో కట్టుకొనినను అక్కడనుండి నిన్ను క్రింద పడద్రోసెదను; ఇదే యెహోవా వాక్కు.
- 17 ఎదోము పాడైపోవును, దాని మార్గమున నడుచువారు ఆశ్చర్యపడి దాని యిడుమలన్నియు చూచి వేళాకోళము చేయుదురు.
- 18 సొదొమయు గొమొఱ్ఱాయు వాటి సమీప పట్టణములును పడగొట్టబడిన తరువాత వాటిలో ఎవడును కాపురముండక పోయినట్లు ఏ మనుష్యుడును అక్కడ కాపురముండడు, ఏ నరుడును దానిలో బసచేయడు.
- 19 చిరకాలము నిలుచు నివాసమును పట్టుకొనవలెనని శత్రు వులు యొర్దాను ప్రవాహములో నుండి సింహమువలె వచ్చుచున్నారు, నిమిషములోనే నేను వారిని దాని యొద్దనుండి తోలివేయుదును, నేనెవని నేర్పరతునో వానిని దానిమీద నియమించెదను; నన్ను పోలియున్న వాడై నాకు ఆక్షేపణ కలుగచేయువాడేడి? నన్ను ఎదిరింప గల కాపరియేడి?
- 20 ఎదోమునుగూర్చి యెహోవా చేసిన ఆలోచన వినుడి. తేమాను నివాసులనుగూర్చి ఆయన ఉద్దేశించినదాని వినుడి. నిశ్చయముగా మందలో అల్పులైన వారిని శత్రువులు లాగుదురు, నిశ్చయముగా వారి నివాస స్థలము వారినిబట్టి ఆశ్చర్యపడును.
- 21 వారు పడిపోగా అఖండమైన ధ్వని పుట్టెను; భూమి దానికి దద్దరిల్లుచున్నది, అంగలార్పు ఘోషయు ఎఱ్ఱసముద్రము దనుక వినబడెను.
- 22 శత్రువు పక్షిరాజువలె లేచి యెగిరి బొస్రామీద పడవలె నని తన రెక్కలు విప్పుకొనుచున్నాడు; ఆ దినమున ఎదోము బలాఢ్యుల హృదయములు ప్రసవించు స్త్రీ హృదయమువలె ఉండును.
- 23 దమస్కును గూర్చిన వాక్కు. హమాతును అర్పాదును దుర్వార్త విని సిగ్గు పడు చున్నవి అవి పరవశములాయెను సముద్రముమీద విచారము కలదుదానికి నెమ్మదిలేదు.
- 24 దమస్కు బలహీనమాయెను. పారిపోవలెనని అది వెనుకతీయుచున్నది వణకు దానిని పట్టెను ప్రసవించు స్త్రీని పట్టునట్లు ప్రయాసవేదనలు దానిని పట్టెను.
- 25 ప్రసిద్ధిగల పట్టణము బొత్తిగా విడువబడెను నాకు ఆనందమునిచ్చు పట్టణము బొత్తిగా విడువ బడెను.
- 26 ఆమె ¸°వనులు ఆమె వీధులలో కూలుదురు ఆ దినమున యోధులందరు మౌనులైయుందురు ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు.
- 27 నేను దమస్కు ప్రాకారములో అగ్ని రాజబెట్టెదను అది బెన్హదదు నగరులను కాల్చివేయును.
- 28 బబులోనురాజైన నెబుకద్రెజరు కొట్టిన కేదారును గూర్చియు హాసోరు రాజ్యములనుగూర్చియు యెహోవా సెల విచ్చినమాట లేచి కేదారునకు వెళ్లుడి తూర్పుదేశస్థులను దోచు కొనుడి.
- 29 వారి గుడారములను గొఱ్ఱల మందలను శత్రువులు కొనిపోవుదురు తెరలను ఉపకరణములను ఒంటెలను వారు పట్టు కొందురు నఖముఖాల భయమని వారు దానిమీద చాటింతురు
- 30 హాసోరు నివాసులారా, బబులోనురాజైన నెబు కద్రెజరు మీమీదికి రావలెనని ఆలోచన చేయు చున్నాడు మీమీద పడవలెనను ఉద్దేశముతో ఉన్నాడు యెహోవా వాక్కు ఇదే పారిపోవుడి బహులోతున వెళ్లుడి అగాధస్థలములలో దాగుడి
- 31 మీరు లేచి ఒంటరిగా నివసించుచు గుమ్మములు పెట్టకయు గడియలు అమర్చకయు నిశ్చింతగాను క్షేమముగాను నివసించు జనముమీద పడుడి.
- 32 వారి ఒంటెలు దోపుడుసొమ్ముగా ఉండును వారి పశువులమందలు కొల్లసొమ్ముగా ఉండును గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొనువారిని నఖముఖాల చెదరగొట్టుచున్నాను నలుదిక్కులనుండి ఉపద్రవమును వారిమీదికి రప్పించు చున్నాను ఇదే యెహోవా వాక్కు,
- 33 హాసోరు చిరకాలము పాడై నక్కలకు నివాస స్థల ముగా ఉండును అక్కడ ఏ మనుష్యుడును కాపురముండడు ఏ నరుడును దానిలో బసచేయడు.
- 34 యూదారాజైన సిద్కియా యేలుబడి ఆరంభములో యెహోవా వాక్కు ప్రవక్తయైన యిర్మీయాకు ప్రత్యక్షమై ఏలామునుగూర్చి
- 35 ఈలాగు సెలవిచ్చెనుసైన్యములకధిపతి యగు యెహోవా సెలవిచ్చినదేమనగానేను ఏలాము యొక్క బలమునకు ముఖ్యాధారమైన వింటిని విరుచు చున్నాను.
- 36 నలుదిశలనుండి నాలుగు వాయువులను ఏలాముమీదికి రప్పించి, నలుదిక్కులనుండి వచ్చు వాయు వులవెంట వారిని చెదరగొట్టుదును, వెలివేయబడిన ఏలాము వారు ప్రవేశింపని దేశమేదియు నుండదు.
- 37 మరియు వారి శత్రువులయెదుటను వారి ప్రాణము తీయజూచు వారియెదుటను ఏలామును భయపడ జేయుదును, నా కోపాగ్నిచేత కీడును వారి మీదికి నేను రప్పించుదును, వారిని నిర్మూలము చేయువరకు వారివెంట ఖడ్గము పంపు చున్నాను; ఇదే యెహోవా వాక్కు.
- 38 నా సింహాసన మును అచ్చటనే స్థాపించి ఏలాములో నుండి రాజును అధిపతులను నాశనముచేయుదును; ఇదే యెహోవా వాక్కు.
- 39 అయితే కాలాంతమున చెరపట్టబడిన ఏలాము వారిని నేను మరల రప్పించెదను; ఇదే యెహోవా వాక్కు.
Jeremiah 49
- Details
- Parent Category: Old Testament
- Category: Jeremiah
యిర్మీయా చాప్టర్ 49