wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


యోబు గ్రంథము చాప్టర్ 14
  • 1 స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడై మిక్కిలిబాధనొందును.
  • 2 పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవునునీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును.
  • 3 అట్టివానిమీద నీవు కనుదృష్టి యుంచియున్నావుతీర్పు నొందుటకై నన్ను నీ యెదుటికి రప్పించియున్నావు.
  • 4 పాపసహితునిలోనుండి పాపరహితుడు పుట్టగలిగినఎంత మేలు?ఆలాగున ఎవడును పుట్టనేరడు.
  • 5 నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలలసంఖ్య నీకు తెలిసేయున్నది.మించజాలని వయఃపరిమాణము నీవు వారికి నియమించి యున్నావు
  • 6 కూలివారివలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించువరకువారు విశ్రమము నొందునట్లు వారివైపు చూడకయుండుము.
  • 7 వృక్షము నరకబడినయెడల అది తిరిగి చిగుర్చుననియుదానికి లేతకొమ్మలు వేయుననియు నమ్మకముకలదు.
  • 8 దాని వేరు భూమిలో పాతదై పోయినను దాని అడుగుమొద్దు మంటిలో చీకిపోయినను
  • 9 నీటి వాసనమాత్రముచేత అది చిగుర్చునులేత మొక్కవలె అది కొమ్మలు వేయును.
  • 10 అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు.నరులు ప్రాణము విడిచినతరువాత వారేమై పోవుదురు?
  • 11 తటాక జలములు ఎట్లు ఇంకిపోవునోనది నీరు ఎట్లు ఎండి హరించిపోవునోఆలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు.
  • 12 ఆకాశము గతించిపోవువరకు వారు మేలుకొనరు.ఎవరును వారిని నిద్ర లేపజాలరు.
  • 13 నీవు పాతాళములో నన్ను దాచినయెడల ఎంతోమేలునీ కోపము చల్లారువరకు నన్ను చాటున నుంచినయెడల ఎంతో మేలునాకు ఇంతకాలమని నీవు నియమించి తరువాత నన్ను జ్ఞాపకము చేసికొనవలెనని నేనెంతో కోరు చున్నాను.
  • 14 మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా?ఆలాగుండినయెడల నాకు విడుదల కలుగువరకునా యుద్ధదినములన్నియు నేను కనిపెట్టియుందును
  • 15 ఆలాగుండినయెడల నీవు పిలిచెదవు నేను నీకు ప్రత్యు త్తరమిచ్చెదనునీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును.
  • 16 అయితే ఇప్పుడు నీవు నా అడుగుజాడలను లెక్కపెట్టుచున్నావునా పాపమును సహింపలేకయున్నావు
  • 17 నా అతిక్రమము సంచిలో ముద్రింపబడియున్నదినేను చేసిన దోషమును భద్రముగా ఉంచియున్నావు.
  • 18 పర్వతమైనను పడిపోయి నాశనమగునుకొండయైనను దాని స్థానము తప్పును.
  • 19 జలము రాళ్లను అరగదీయునుదాని ప్రవాహములు భూమియొక్క ధూళిని కొట్టుకొనిపోవునునీవైతే నరుల ఆశను భంగపరచుచున్నావు.
  • 20 నీవు వారిని ఎల్లప్పుడు గెలుచుచున్నావు గనుక వారు గతించిపోవుదురునీవు వారికి ముఖవికారము కలుగజేసి వారిని వెళ్లగొట్టుచున్నావు.
  • 21 వారి కుమారులు ఒకవేళ షునత వహించినను అదివారికి తెలియకపోవును.వారు ఒకవేళ అణిగిపోయినను అట్టి గతి వారికిపట్టెనని వారు గ్రహింపకయుందురు.
  • 22 తమమట్టుకు తామే శరీరమునందు నొప్పి నొందుదురుతమమట్టుకు తామే ప్రాణమునందు దుఃఖపడుదురు.