- 1 అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను
- 2 శక్తిలేనివానికి నీవు ఎంత సహాయము చేసితివి? బలములేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి?
- 3 జ్ఞానము లేనివానికి నీ వెంత చక్కగా ఆలోచనచెప్పితివి?సంగతిని ఎంత చక్కగా వివరించితివి?
- 4 నీవు ఎవనియెదుట మాటలను ఉచ్చరించితివి?ఎవని ఊపిరి నీలోనుండి బయలుదేరినది?
- 5 జలములక్రిందను వాటి నివాసులక్రిందను ఉండుప్రేతలు విలవిలలాడుదురు.
- 6 ఆయన దృష్టికి పాతాళము తెరువబడియున్నదినాశనకూపము బట్టబయలుగా నున్నది.
- 7 శూన్యమండలముపైని ఉత్తరదిక్కుననున్న ఆకాశవిశాలమును ఆయన పరచెనుశూన్యముపైని భూమిని వ్రేలాడచేసెను.
- 8 వాటిక్రింద మేఘములు చినిగిపోకుండఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను.
- 9 దానిమీద మేఘమును వ్యాపింపజేసిఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరచెను.
- 10 వెలుగు చీకటుల సరిహద్దులవరకుఆయన జలములకు హద్దు నియమించెను.
- 11 ఆయన గద్దింపగా ఆకాశవిశాల స్తంభములు విస్మయ మొంది అదరును
- 12 తన బలమువలన ఆయన సముద్రమును రేపునుతన వివేకమువలన రాహాబును పగులగొట్టును.
- 13 ఆయన ఊపిరి విడువగా ఆకాశవిశాలములకు అందము వచ్చును.ఆయన హస్తము పారిపోవు మహా సర్పమును పొడిచెను.
- 14 ఇవి ఆయన కార్యములలో స్వల్పములు.ఆయననుగూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలిమెల్లనైన గుసగుస శబ్దముపాటిదే గదా.గర్జనలుచేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింప గలవాడెవడు?
Job 26
- Details
- Parent Category: Old Testament
- Category: Job
యోబు గ్రంథము చాప్టర్ 26