wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


యెహొషువ చాప్టర్ 5
  • 1 వారు దాటుచుండగా ఇశ్రాయేలీయుల యెదుట నుండి యెహోవా యొర్దాను నీళ్లను ఎండచేసిన సంగతి యొర్దానుకు పడమటిదిక్కుననున్న అమోరీయుల రాజు లందరును సముద్రమునొద్దనున్న కనానీయుల రాజు లందరును వినినప్పుడు వారి గుండెలు చెదరిపోయెను. ఇశ్రా యేలీయుల భయముచేత వారి కిక ధైర్యమేమియు లేక పోయెను.
  • 2 ఆ సమయమున యెహోవారాతికత్తులు చేయించు కొని మరల ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించుమని యెహోషువకు ఆజ్ఞాపింపగా
  • 3 యెహోషువ రాతికత్తులు చేయించుకొని సున్నతి గిరి అను స్థలము దగ్గర ఇశ్రాయేలీ యులకు సున్నతి చేయించెను.
  • 4 యెహోషువ సున్నతి చేయించుటకు హేతువేమనగా, ఐగుప్తులోనుండి బయలు దేరినవారందరిలో యుద్ధసన్నద్ధులైన పురుషులందరు ఐగుప్తు మార్గమున అరణ్యములో చనిపోయిరి.
  • 5 బయలుదేరిన పురుషులందరు సున్నతి పొందినవారే కాని ఐగుప్తులో నుండి బయలుదేరిన తరువాత అరణ్యమార్గమందు పుట్టిన వారిలో ఎవరును సున్నతి పొందియుండలేదు.
  • 6 యెహోవా మనకు ఏ దేశమును ఇచ్చెదనని వారి పితరులతో ప్రమా ణముచేసెనో, పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపనని యెహోవా ప్రమాణము చేసి యుండెను గనుక ఐగుప్తులోనుండి వచ్చిన ఆ యోధు లందరు యెహోవా మాట వినకపోయినందున వారు నశించువరకు ఇశ్రాయేలీయులు నలువది సంవత్సరములు అరణ్యములో సంచరించుచు వచ్చిరి.
  • 7 ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది యుండలేదు గనుక వారికి సున్నతి చేయించెను; ఏల యనగా మార్గమున వారికి సున్నతి జరుగలేదు.
  • 8 ​కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తరువాత తాము బాగుపడు వరకు పాళెములోని తమ చోట్ల నిలిచిరి.
  • 9 ​అప్పుడు యెహోవానేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండ దొరలించివేసి యున్నానని యెహో షువతో ననెను. అందుచేత నేటివరకు ఆ చోటికి గిల్గా లను పేరు.
  • 10 ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల పదు నాలుగవ తేదిని సాయంకాలమున యెరికో మైదానములో పస్కాపండుగను ఆచరించిరి.
  • 11 పస్కా పోయిన మరు నాడు వారు ఈ దేశపు పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయు వేచబడియునున్న భక్ష్య ములను తినిరి.
  • 12 మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను; అటుతరువాత ఇశ్రాయేలీయులకు మన్నా దొరకకపోయెను. ఆ సంవత్సరమున వారు కనానుదేశపు పంటను తినిరి.
  • 13 యెహోషువ యెరికో ప్రాంతమున నున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా, దూసిన కత్తి చేత పట్టుకొనియున్న ఒకడు అతని యెదుట నిలిచియుండెను; యెహోషువ అతనియొద్దకు వెళ్లినీవు మా పక్షముగా నున్నవాడవా, మా విరోధులపక్షముగా నున్నవాడవా? అని అడుగగా
  • 14 అతడుకాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి యున్నాననెను. యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారముచేసినా యేలినవాడు తన దాసునికి సెల విచ్చునదేమని అడిగెను.
  • 15 అందుకు యెహోవా సేనాధిపతి నీవు నిలిచియున్న యీ స్థలము పరిశుద్ధమైనది, నీ పాద రక్షలను తీసి వేయుమని యెహోషువతో చెప్పగా యెహో షువ ఆలాగు చేసెను.