- 1 అబీమెలెకునకు తరువాత ఇశ్శాఖారు గోత్రికుడైన దోదో మనుమడును పువ్వా కుమారుడునైన తోలా న్యాయాధిపతిగా నియమింపబడెను. అతడు ఎఫ్రా యిమీయుల మన్యమందలి షామీరులో నివసించినవాడు.
- 2 అతడు ఇరువదిమూడు సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతియై ఉండి చనిపోయి షామీరులో పాతి పెట్టబడెను.
- 3 అతని తరువాత గిలాదుదేశస్థుడైన యాయీరు నియ మింపబడినవాడై యిరువదిరెండు సంవత్సరములు ఇశ్రా యేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను.
- 4 అతనికి ముప్పదిమంది కుమారులుండిరి, వారు ముప్పది గాడిదపిల్లల నెక్కి తిరుగువారు, ముప్పది ఊరులు వారికుండెను, నేటి వరకు వాటికి యాయీరు గ్రామములని పేరు.
- 5 అవి గిలాదు దేశములో నున్నవి. యాయీరు చనిపోయి కామోనులో పాతిపెట్టబడెను.
- 6 ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరల దుష్ ప్రవర్తనులైరి. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి, బయలులు అష్తారోతులు అను సిరియనుల దేవత లను సీదోనీయుల దేవతలను మోయాబీయుల దేవతలను అమ్మోనీయుల దేవతలను ఫిలిష్తీయుల దేవతలను పూజిం చుచువచ్చిరి.
- 7 యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన ఫిలిష్తీయుల చేతికిని అమ్మోనీయుల చేతికిని వారినప్పగించెను గనుక
- 8 వారు ఆ సంవత్సరము మొదలుకొని ఇశ్రాయేలీయులను, అనగా యొర్దాను అవతల నున్న గిలాదునందలి అమోరీయుల దేశములో కాపుర మున్న ఇశ్రాయేలీయులను పదునెనిమిది సంవత్సరములు చితుకగొట్టి అణచివేసిరి.
- 9 మరియు అమ్మోనీయులు యూదాదేశస్థులతోను బెన్యామీనీయులతోను ఎఫ్రాయి మీయులతోను యుద్ధముచేయుటకు యొర్దానును దాటిరి గనుక ఇశ్రాయేలీయులకు మిక్కిలి శ్రమ కలిగెను
- 10 అప్పుడు ఇశ్రాయేలీయులుమేము నీ సన్నిధిని పాపము చేసియున్నాము, మా దేవుని విడిచి బయలులను పూజించి యున్నామని యెహోవాకు మొఱ్ఱపెట్టగా
- 11 యెహోవా ఐగుప్తీయుల వశములోనుండియు అమోరీయుల వశ ములో నుండియు అమ్మోనీయుల వశములోనుండియు ఫిలిష్తీ యుల వశములోనుండియు మాత్రము గాక
- 12 సీదోనీయు లును అమాలేకీయులును మాయోనీయులును మిమ్మును బాధ పరచినప్పుడు వారి వశములోనుండియు నేను మిమ్మును రక్షిం చితిని గదా
- 13 అయితే మీరు నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించితిరి గనుక నేను ఇకను మిమ్మును రక్షిం పను.
- 14 పోయి మీరు కోరుకొనిన దేవతలకు మొఱ్ఱపెట్టు కొనుడి; మీ శ్రమకాలమున అవి మిమ్మును రక్షించునేమో అని ఇశ్రాయేలీయులతో సెలవిచ్చెను.
- 15 అప్పుడు ఇశ్రా యేలీయులుమేము పాపము చేసియున్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయుము; దయ చేసి నేడు మమ్మును రక్షింపుమని చెప్పి
- 16 యెహోవాను సేవింపవలెనని తమ మధ్యనుండి అన్యదేవతలను తొల గింపగా, ఆయన ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూచి సహింపలేక పోయెను.
- 17 అప్పుడు అమ్మోనీయులు కూడుకొని గిలాదులో దిగి యుండిరి. ఇశ్రాయేలీయులును కూడుకొని మిస్పాలో దిగియుండిరి.
- 18 కాబట్టి జనులు, అనగా గిలాదు పెద్దలుఅమ్మోనీయులతో యుద్ధముచేయ బూనుకొనువాడెవడో వాడు గిలాదు నివాసులకందరికిని ప్రధానుడగునని యొక నితో నొకడు చెప్పుకొనిరి.
Judges 10
- Details
- Parent Category: Old Testament
- Category: Judges
న్యాయాధిపతులు చాప్టర్ 10