- 1 నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి, ద్వార పాలకులను గాయకులను లేవీయులను నియమించిన పిమ్మట
- 2 నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతియైన హనన్యాకును యెరూషలేముపైన అధి కారము ఇచ్చితిని. హనన్యా నమ్మకమైన మనుష్యుడు, అందరికంటె ఎక్కువగా దేవునియెదుట భయభక్తులు గలవాడు.
- 3 అప్పుడు నేనుబాగుగా ప్రొద్దెక్కు వరకు యెరూషలేముయొక్క గుమ్మముల తలుపులు తియ్యకూడదు;మరియు జనులు దగ్గర నిలువబడియుండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి వేయవలెననియు, ఇదియుగాక యెరూషలేము కాపురస్థు లందరు తమ తమ కావలి వంతులనుబట్టి తమ యిండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి నియమింపవలెననియు చెప్పితిని.
- 4 అప్పటిలో ఆ పట్టణము మిగుల విశాలముగాను పెద్దదిగాను ఉండెనుగాని దానిలో జనులు కొద్దిగా ఉండిరి, యిండ్లు ఇంక కట్టబడలేదు.
- 5 జనసంఖ్యచేయునట్లు నా దేవుడు నా హృదయములో తలంపు పుట్టింపగా, ప్రధానులను అధికారులను జనులను నేను సమకూర్చితిని. అంతలో ముందు వచ్చినవారినిగూర్చిన వంశావళి గ్రంథము నాకు కనబడెను, అందులో వ్రాయబడిన వంశావళులు ఇవి.
- 6 జెరుబ్బాబెలు యేషూవ నెహెమ్యా అజర్యా రయమ్యా నహమానీ మొర్దెకై బిల్షాను మిస్పెరేతు బిగ్వయి నెహూము బయనా అనువారితోకూడ బాబెలు రాజైన నెబుకద్నెజరుచేత చెరలోనికి కొనిపోబడి
- 7 తిరిగి యెరూషలేమునకును యూదాదేశమునకును తమ తమ పట్టణములకు వచ్చినవారు వీరే. ఇశ్రాయేలీయులయొక్క జనసంఖ్య యిదే.
- 8 అది ఏలాగనగా పరోషువంశస్థులు రెండువేల నూట డెబ్బదియిద్దరును
- 9 షెఫట్య వంశస్థులు మూడువందల డెబ్బది యిద్దరును
- 10 ఆరహు వంశస్థులు ఆరువందల ఏబది యిద్దరును
- 11 యేషూవ యోవాబు సంబంధు లైన పహత్మోయాబు వంశస్థులు రెండువేల ఎనిమిదివందల పదునెనిమిదిమందియు
- 12 ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురును.
- 13 జత్తూవంశస్థులు ఎనిమిది వందల నలువది యయిదుగురును
- 14 జక్కయి వంశస్థులు ఏడువందల అరువది మందియు
- 15 బిన్నూయి వంశస్థులుఆరువందల నలువది యెనమండుగురును
- 16 బేబై వంశస్థులు ఆరువందల ఇరువది యెనమండుగురును
- 17 అజ్గాదు వంశస్థులు రెండువేల మూడువందల ఇరువది యిద్దరును
- 18 అదోనీకాము వంశస్థులు ఆరువందల అరువది యేడుగురును
- 19 బిగ్వయి వంశస్థులు రెండు వేల అరువది యేడుగురును
- 20 అదీను వంశస్థులు ఆరువందల ఏబది యయిదుగురును
- 21 హిజ్కియా బంధువుడైన ఆటేరు వంశస్థులు తొంబది యెనమండు గురును
- 22 హాషుము వంశస్థులు మూడువందల ఇరువది యెనమండుగురును
- 23 జేజయి వంశస్థులు మూడువందల ఇరువదినలుగురును
- 24 హారీపు వంశస్థులు నూటపండ్రెండు గురును
- 25 గిబియోను వంశస్థులు తొంబది యయిదు గురును
- 26 బేత్లెహేము నెటోపావారు నూట ఎనుబది యెనమండు గురును
- 27 అనాతోతువారు నూట ఇరువది యెనమండు గురు
- 28 బేతజ్మావెతువారు నలువది యిద్దరును
- 29 కిర్యత్యారీము కెఫీరా బెయేరోతులవారు ఏడువందల నలువది ముగ్గురును
- 30 రామా గెబలవారు ఆరువందల ఇరువది యొకరును
- 31 మిక్మషువారు నూట ఇరువది యిద్దరును
- 32 బేతేలు హాయిలవారు నూట ఇరువది ముగ్గురును
- 33 రెండవ నెబోవారు ఏబది యిద్దరును
- 34 రెండవ ఏలాము వారు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురును
- 35 హారిము వంశస్థులు మూడువందల ఇరువది మందియు
- 36 యెరికో వంశస్థులు మూడువందల నలువది యయిదుగురును
- 37 లోదు హదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడువందల ఇరువది యొకరును
- 38 సెనాయా వంశస్థులు మూడువేల తొమి్మది వందల ముప్పది మందియు
- 39 యాజకులలో యేషూవ యింటివారైన యెదాయా వంశస్థులు తొమి్మదివందల డెబ్బది ముగ్గురును
- 40 ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది యిద్దరును
- 41 పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువది యేడుగురును
- 42 హారిము వంశస్థులు వెయ్యిన్ని పదు నేడుగురును
- 43 లేవీయులైన యేషూవ హోదవ్యా కద్మీయేలు అనువారి వంశస్థులు డెబ్బది నలుగురును
- 44 గాయకు లైన ఆసాపు వంశస్థులు నూట నలువది యెనమండుగురును
- 45 ద్వారపాలకులైన షల్లూము వంశస్థులు అటేరు వంశస్థులు టల్మోను వంశ స్థులు అక్కూబు వంశస్థులు హటీటా వంశస్థులు షోబయి వంశస్థులు నూట ముప్పది యెనమండు గురునుొ
- 46 నెతీనీయులైన జీహా వంశస్థులు హశూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు
- 47 కేరోసు వంశస్థులు సీయహా వంశస్థులు పాదోను వంశస్థులు
- 48 లెబానా వంశస్థులు హగాబా వంశస్థులు షల్మయి వంశస్థులు
- 49 హానాను వంశస్థులు గిద్దేలు వంశస్థులు గహరు వంశస్థులు
- 50 రెవాయ వంశస్థులు రెజీను వంశస్థులు నెకోదా వంశస్థులు
- 51 గజ్జాము వంశస్థులు ఉజ్జా వంశస్థులు పాసెయ వంశస్థులు
- 52 బేసాయి వంశస్థులు మెహూనీము వంశస్థులు నెపూషేసీము వంశస్థులు.
- 53 బక్బూకు వంశస్థులు హకూపా వంశస్థులు హర్హూరు వంశస్థులు
- 54 బజ్లీతు వంశస్థులు మెహీదా వంశస్థులు హర్షా వంశస్థులు
- 55 బర్కోసు వంశస్థులు సీసెరా వంశస్థులు తెమహు వంశస్థులునెజీయహు వంశస్థులు హటీపా వంశస్థులు
- 56 సొలొమాెెను దాసుల వంశస్థులు సొటయి వంశస్థులు
- 57 సోపెరెతు వంశస్థులు పెరూదా వంశస్థులు
- 58 యహలా వంశస్థులు దర్కోను వంశస్థులు గిద్దేలు వంశస్థులు
- 59 షెఫట్య వంశస్థులు హట్టీలు వంశస్థులు జెబాయీయుల సంబంధమైన పొకెరెతు వంశస్థులు ఆమోను వంశస్థులు.
- 60 ఈ నెతీనీయులందరును సొలొమోను దాసుల వంశస్థులును మూడువందల తొంబది యిద్దరు.
- 61 తేల్మెలహు తేల్హర్షా కెరూబు అదోను ఇమ్మేరు మొద లైన స్థలములనుండి వచ్చినవారు తాము ఇశ్రాయేలీయుల సంబంధులో కారో తెలుపుటకు తమ యింటి పేరులైనను తమ వంశావళి పత్రికయైనను కనుపరచలేకపోయిరి.
- 62 వారెవరనగా దెలాయ్యా వంశస్థులు టోబీయా వంశస్థులు నెరోదా వంశస్థులు వీరు ఆరువందల నలువది యిద్దరు
- 63 హబాయ్యా వంశస్థులు హక్కోజు వంశస్థులు బర్జిల్లయి వంశస్థులు, అనగా గిలాదీయులైన బర్జిల్లయి కుమార్తెలలో ఒకతెను పెండ్లి చేసికొని వారి పేరుచేత పిలువబడిన బర్జిల్లయి వంశస్థులును యాజక సంతానులు.
- 64 వీరి వంశా వళులనుబట్టి యెంచబడినవారిలో వారి పద్దు పుస్తకమును వెదకగా అది కనబడకపోయెను; కాగా వారు అపవిత్రు లుగా ఎంచబడి యాజకులలో ఉండకుండ వేరుపరచబడిరి.
- 65 కాగా అధికారిఊరీము తుమీ్మము అనువాటిని ధరించు కొని ఒక యాజకుడు ఏర్పడువరకు అతి పరిశుద్ధవస్తువులను మీరు తినకూడదని వారితో చెప్పెను.
- 66 సమాజకులందరును నలువది రెండువేల మూడువందల అరువదిమంది.
- 67 వీరు గాక వీరి పని వారును పనికత్తెలును ఏడు వేల మూడు వందల ముప్పది యేడుగురును, గాయకులలో స్త్రీ పురు షులు రెండువందల నలువది యయిదుగురునై ఉండిరి.
- 68 వారి గుఱ్ఱములు ఏడువందల ముప్పది ఆరును, వారి కంచర గాడిదలు రెండువందల నలువది యయిదును
- 69 వారి ఒంటెలు నాలుగువందల ముప్పది యయిదును వారి గాడిదలు ఆరు వేల ఏడువందల ఇరువదియునై యుండెను.
- 70 పెద్దలలో ప్రధానులైన కొందరు పనికి కొంత సహా యము చేసిరి. అధికారి ఖజానాలో నూట ఇరువది తులముల బంగారమును ఏబది పళ్లెములను ఏడువందల ముప్పది యాజక వస్త్రములను వేసి యిచ్చెను.
- 71 మరియు పెద్దలలో ప్రధానులైనవారు కొందరు ఖజానాలో నూట నలువది తులముల బంగారమును పదునాలుగు లక్షల తుల ముల వెండిని వేసిరి.
- 72 మిగిలినవారును రెండువందల నలువది తులముల బంగారమును రెండువందల నలువది లక్షల తుల ముల వెండిని అరువదియేడు యాజక వస్త్రములను ఇచ్చిరి.
- 73 అప్పుడు యాజకులు లేవీయులు ద్వారపాలకులు గాయ కులు జనులలో కొందరును, నెతీనీయులు ఇశ్రాయేలీయు లందరును, తమ పట్టణములయందు నివాసము చేసిరి.
Nehemiah 07
- Details
- Parent Category: Old Testament
- Category: Nehemiah
నెహెమ్యా చాప్టర్ 7