wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


సంఖ్యాకాండము చాప్టర్ 10
  • 1 యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెనునీవు రెండు వెండి బూరలు చేయించుకొనుము;
  • 2 ​నకిషిపనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తర్లించుటకును నీకుండవలెను.
  • 3 ఊదువారు వాటిని ఊదునప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునెదుట నీ యొద్దకు కూడి రావలెను.
  • 4 వారు ఒకటే ఊదినయెడల ఇశ్రాయేలీయుల సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీయొద్దకు కూడి రావలెను.
  • 5 మీరు ఆర్భాటముగా ఊదునప్పుడు తూర్పుదిక్కున దిగి యున్న సైన్యములు సాగవలెను.
  • 6 ​మీరు రెండవమారు ఆర్భాటముగా ఊదునప్పుడు దక్షిణదిక్కున దిగిన సైన్య ములు సాగవలెను. వారు ప్రయాణమైపోవునప్పుడు ఆర్భాటముగా ఊదవలెను.
  • 7 ​సమాజమును కూర్చునప్పుడు ఊదవలెను గాని ఆర్భాటము చేయవలదు.
  • 8 అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఊదవలెను; నిత్య మైన కట్టడనుబట్టి అవి మీ వంశముల పరంపరగా మీకు ఉండును.
  • 9 మిమ్మును బాధించు శత్రువులకు విరోధ ముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్లునప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలెను అప్పుడు మీ దేవు డైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువులనుండి రక్షింపబడుదురు.
  • 10 మరియు ఉత్సవ దినమందును నియామక కాలములయందును నెలల ఆరంభ ములయందును మీరు దహనబలులనుగాని సమాధానబలు లనుగాని అర్పించునప్పుడు ఆ బూరలు ఊదవలెను అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును మీ దేవుడైన యెహోవాను నేనే.
  • 11 రెండవ సంవత్సరము రెండవ నెల యిరువదియవ తేదిని మేఘము సాక్ష్యపు మందిరము మీదనుండి పైకెత్తబడెను గనుక ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యములోనుండి ప్రయాణములు చేయసాగిరి.
  • 12 తరువాత ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచెను.
  • 13 యెహోవా మోషే చేత పలికించిన మాటనుబట్టి వారు మొదట ప్రయాణము చేసిరి.
  • 14 యూదీయుల పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున ముందర సాగెను; అమీ్మనాదాబు కుమారుడైన నయస్సోను ఆ సైన్యమునకు అధిపతి.
  • 15 ఇశ్శాఖారీయుల గోత్రసైన్య మునకు సూయారు కుమారుడైన నెతనేలు అధి పతి.
  • 16 జెబూలూనీయుల గోత్రసైన్యమునకు హేలోను కుమారుడైన ఏలీయాబు అధిపతి.
  • 17 మందిరము విప్పబడి నప్పుడు గెర్షోనీయులును మెరారీయులును మందిరమును మోయుచు సాగిరి.
  • 18 రూబేనీయుల పాళెము ధ్వజము వారి సేనలచొప్పున సాగెను. ఆ సైన్యమునకు షెదే యూరు కుమారుడైన ఏలీసూరు అధిపతి.
  • 19 ​షిమ్యోనీయుల గోత్రసైన్యమునకు సూరీషదాయి కుమారుడైన షెలుమీ యేలు అధిపతి.
  • 20 ​గాదీయుల గోత్రసైన్యమునకు దెయు వేలు కుమారుడైన ఎలీయా సాపు అధిపతి.
  • 21 ​​కహాతీయులు పరిశుద్ధమైనవాటిని మోయుచుసాగిరి; అందరు వచ్చులోగా వారు మందిర మును నిలువబెట్టిరి.
  • 22 ఎఫ్రాయీమీయుల పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున సాగెను; ఆ సైన్యము నకు అమీహూదు కుమారుడైన ఎలీషామా అధిపతి.
  • 23 పెదాసూరు కుమారుడైన గమలీయేలు మనష్షీయుల గోత్ర సైన్యమునకు అధిపతి.
  • 24 ​గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీనుల గోత్రసైన్యమునకు అధిపతి.
  • 25 దానీయుల పాళెపు ధ్వజము సాగెను; అది పాళెములన్నిటిలో వెనుక నుండెను; అమీషదాయి కుమారుడైన అహీయెజరు ఆ సైన్యమునకు అధిపతి
  • 26 ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరీయుల గోత్రసైన్య మునకు అధిపతి.
  • 27 ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలీయుల గోత్రసైన్య మునకు అధిపతి.
  • 28 ఇశ్రాయేలీయులు ప్రయాణముచేయు నప్పుడు తమ తమ సైన్యముల చొప్పుననే ప్రయాణమై సాగిరి.
  • 29 మోషే మామయగు మిద్యానీయుడైన రెవూయేలు కుమారుడగు హోబాబుతో మోషేయెహోవా మా కిచ్చెదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమై పోవుచున్నాము; మాతోకూడ రమ్ము; మేము మీకు మేలు చేసెదము; యెహోవా ఇశ్రాయేలీయులకు తాను చేయబోవు మేలునుగూర్చి వాగ్దానము చేసెననగా
  • 30 అందు కతడునేను రాను, నా దేశమునకును నా వంశస్థుల యొద్దకును వెళ్లుదుననెను.
  • 31 అందుకు మోషేనీవు దయ చేసి మమ్మును విడువకుము; ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసియున్నవి; నీవు మాకు కన్నులవలె ఉందువు.
  • 32 మరియు నీవు మాతోకూడ వచ్చినయెడల యెహోవా మాకు ఏ మేలుచేయునో ఆ మేలునుబట్టి మేము నీకు మేలు చేయుదుమనెను.
  • 33 వారు యెహోవా కొండనుండి మూడు దినముల ప్రయాణముచేసిరి; వారికి విశ్రాంతిస్థలము చూచుటకు ఆ మూడు దినముల ప్రయాణములో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను.
  • 34 వారు తాము దిగిన స్థలమునుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటివేళ వారిమీద ఉండెను.
  • 35 ఆ మందసము సాగినప్పుడు మోషేయెహోవా లెమ్ము; నీ శత్రువులు చెదరిపోవుదురుగాక, నిన్ను ద్వేషించువారు నీ యెదుటనుండి పారిపోవుదురుగాక యనెను.
  • 36 అది నిలిచినప్పుడు అతడుయెహోవా, ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరల రమ్మనెను.