- 1 యెహోవా, నా మాటలు చెవినిబెట్టుము నా ధ్యానముమీద లక్ష్యముంచుము.
- 2 నా రాజా నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము.నిన్నే ప్రార్థించుచున్నాను.
- 3 యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడునుఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధముచేసికాచియుందును.
- 4 నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీయొద్ద చోటులేదు
- 5 డాంబికులు నీ సన్నిధిని నిలువలేరుపాపము చేయువారందరు నీకసహ్యులు
- 6 అబద్ధమాడువారిని నీవు నశింపజేయుదువుకపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు.
- 7 నేనైతే నీ కృపాతిశయమునుబట్టి నీ మందిరములోప్రవేశించెదనునీయెడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయముదిక్కు చూచి నమస్కరించెదను
- 8 యెహోవా, నాకొఱకు పొంచియున్న వారినిబట్టినీ నీత్యానుసారముగా నన్ను నడిపింపుమునీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము.
- 9 వారి నోట యథార్థత లేదువారి అంతరంగము నాశనకరమైన గుంటవారి కంఠము తెరచిన సమాధివారు నాలుకతో ఇచ్చకములాడుదురు.
- 10 దేవా, వారు నీమీద తిరుగబడియున్నారువారిని అపరాధులనుగా తీర్చుము.వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాకవారు చేసిన అనేక దోషములనుబట్టి వారిని వెలివేయుము.
- 11 నిన్ను ఆశ్రయించువారందరు సంతోషించుదురునీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యముఆనందధ్వని చేయుదురు.
- 12 యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవేకేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవుకావున నీ నామమును ప్రేమించువారు నిన్నుగూర్చిఉల్లసింతురు.
Psalms 005
- Details
- Parent Category: Old Testament
- Category: Psalms
కీర్తనల గ్రంథము చాప్టర్ 5