- 1 యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చియున్నానునన్ను తరుమువారిచేతిలోనుండి నన్ను తప్పించుము.నన్ను తప్పించువాడెవడును లేకపోగా
- 2 వారు సింహమువలె ముక్కలుగా చీల్చివేయకుండనన్ను తప్పించుము.
- 3 యెహోవా నా దేవా, నేను ఈ కార్యముచేసినయెడల
- 4 నాచేత పాపము జరిగినయెడలనాతో సమాధానముగా నుండినవానికి నేను కీడుచేసినయెడల
- 5 శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్మునా ప్రాణమును నేలకు అణగద్రొక్క నిమ్మునా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము.నిర్నిమిత్తముగా నన్ను బాధించినవారిని నేను సంరక్షించి ని గదా.(సెలా.)
- 6 యెహోవా, కోపము తెచ్చుకొని లెమ్మునా విరోధుల ఆగ్రహము నణచుటకై లెమ్మునన్ను ఆదుకొనుటకై మేల్కొనుమున్యాయవిధిని నీవు నియమించియున్నావు గదా.
- 7 జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనునప్పుడువారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము.
- 8 యెహోవా జనములకు తీర్పు తీర్చువాడుయెహోవా, నా నీతినిబట్టియు నా యథార్థతను బట్టియు నా విషయములోనాకు న్యాయము తీర్చుము.
- 9 హృదయములను అంతరింద్రియములనుపరిశీలించు నీతిగల దేవా,
- 10 దుష్టుల చెడుతనము మాన్పుమునీతిగలవారిని స్థిరపరచుముయథార్థ హృదయులను రక్షించు దేవుడేనా కేడెమును మోయువాడై యున్నాడు.
- 11 న్యాయమునుబట్టి ఆయన తీర్పు తీర్చునుఆయన ప్రతిదినము కోపపడు దేవుడు.
- 12 ఒకడును మళ్లనియెడల, ఆయన తన ఖడ్గమును పదును పెట్టునుతన విల్లు ఎక్కు పెట్టి దానిని సిద్ధపరచి యున్నాడు
- 13 వానికొరకు మరణసాధనములను సిద్ధపరచియున్నాడుతన అంబులను అగ్ని బాణములుగా చేసియున్నాడు
- 14 పాపమును కనుటకు వాడు ప్రసవవేదన పడుచున్నాడుచేటును గర్భమున ధరించినవాడై అబద్దమును కని యున్నాడు.
- 15 వాడు గుంటత్రవ్వి దానిని లోతుచేసియున్నాడుతాను త్రవ్విన గుంటలో తానేపడిపోయెను.
- 16 వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదికే వచ్చునువాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తిమీదనే పడును.
- 17 యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదనుసర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను.
Psalms 007
- Details
- Parent Category: Old Testament
- Category: Psalms
కీర్తనల గ్రంథము చాప్టర్ 7