- 1 నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదనుయెహోవా, నీ అద్భుతకార్యములన్నిటిని నేను వివ రించెదను.
- 2 మహోన్నతుడా, నేను నిన్నుగూర్చి సంతోషించిహర్షించుచున్నానునీ నామమును కీర్తించెదను.
- 3 నీవు నా పక్షమున వ్యాజ్యెమాడి నాకు న్యాయము తీర్చుచున్నావునీవు సింహాసనాసీనుడవై న్యాయమునుబట్టి తీర్పుతీర్చుచున్నావు
- 4 కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్లుదురునీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు.
- 5 నీవు అన్యజనులను గద్దించి యున్నావు, దుష్టులనునశింపజేసి యున్నావువారి పేరు ఎన్నటికి నుండకుండ తుడుపు పెట్టియున్నావు.
- 6 శత్రువులు నశించిరి, వారు ఎన్నడు నుండకుండనిర్మూలమైరినీవు పెల్లగించిన పట్టణములు స్మరణకు రాకుండబొత్తిగా నశించెను.
- 7 యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడైయున్నాడు.న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి యున్నాడు.
- 8 యెహోవా నీతినిబట్టి లోకమునకు తీర్పు తీర్చునుయథార్థతనుబట్టి ప్రజలకు న్యాయము తీర్చును.
- 9 నలిగినవారికి తాను మహా దుర్గమగునుఆపత్కాలములలో వారికి మహా దుర్గమగును
- 10 యెహోవా, నిన్ను ఆశ్రయించువారిని నీవు విడిచిపెట్టువాడవు కావుకావున నీ నామమెరిగినవారు నిన్ను నమ్ముకొందురు
- 11 సీయోను వాసియైన యెహోవాను కీర్తించుడిఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి.
- 12 ఆయన రక్తాపరాధమునుగూర్చి విచారణచేయునప్పుడు బాధపరచబడువారిని జ్ఞాపకము చేసికొనునువారి మొఱ్ఱను ఆయన మరువడు.
- 13 నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధిచేయుచుసీయోను కుమార్తె గుమ్మములలోనీ రక్షణనుబట్టి హర్షించునట్లుయెహోవా, నన్ను కరుణించుము.
- 14 మరణద్వారమున ప్రవేశించకుండ నన్ను ఉద్ధరించువాడా,నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధనుచూడుము.
- 15 తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి.తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడియున్నది.
- 16 యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చియున్నాడు.దుష్టులు తాముచేసికొనినదానిలో చిక్కియున్నారు(హిగ్గాయోన్ సెలా.)
- 17 దుష్టులును దేవుని మరచు జనులందరునుపాతాళమునకు దిగిపోవుదురు.
- 18 దరిద్రులు నిత్యము మరువబడరుబాధపరచబడువారి నిరీక్షణాస్పదము ఎన్నటికినినశించదు.
- 19 యెహోవా లెమ్ము, నరులు ప్రబలక పోవుదురు గాకనీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురు గాక.
- 20 యెహోవా, వారిని భయపెట్టుముతాము నరమాత్రులమని జనులు తెలిసికొందురు గాక.(సెలా.)
Psalms 009
- Details
- Parent Category: Old Testament
- Category: Psalms
కీర్తనల గ్రంథము చాప్టర్ 9