- 1 బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును.
- 2 యెహోవా వానిని కాపాడి బ్రదికించును భూమిమీద వాడు ధన్యుడగును వానిశత్రువుల యిచ్ఛకు నీవు వానిని అప్పగింపవు.
- 3 రోగశయ్యమీద యెహోవా వానిని ఆదరించును రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు.
- 4 యెహోవా నీ దృష్టియెదుట నేను పాపము చేసి యున్నాను నన్ను కరుణింపుము నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసియున్నాను.
- 5 అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డమాట లాడుచున్నారు వాడు ఎప్పుడు చచ్చును? వాని పేరు ఎప్పుడు మాసిపోవును? అని చెప్పుకొనుచున్నారు.
- 6 ఒకడు నన్ను చూడవచ్చినయెడల వాడు అబద్ధ మాడును వాని హృదయము పాపమును పోగుచేసికొను చున్నది. వాడు బయలువెళ్లి వీధిలో దాని పలుకుచున్నాడు.
- 7 నన్ను ద్వేషించువారందరు కూడి నామీద గుసగుస లాడుచున్నారు నశింపజేయవలెనని వారు నాకు కీడుచేయ నాలో చించుచున్నారు.
- 8 కుదురని రోగము వానికి సంభవించియున్నది వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొను చున్నారు.
- 9 నేను నమ్ముకొనిన నా విహితుడు నా యింట భోజ నము చేసినవాడు. నన్ను తన్నుటకై తన మడిమె నెత్తెను
- 10 యెహోవా, నన్ను కరుణించి లేవనెత్తుము అప్పుడు నేను వారికి ప్రతికారము చేసెదను.
- 11 నా శత్రువు నామీద ఉల్లసింపక యుండుటచూడగా నేను నీకు ఇష్టుడనని తెలియనాయెను.
- 12 నా యథార్థతనుబట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు నీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టుదువు.
- 13 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వతకాలమునుండి శాశ్వతకాలమువరకు స్తుతింప బడును గాక. ఆమేన్. ఆమేన్.
Psalms 041
- Details
- Parent Category: Old Testament
- Category: Psalms
కీర్తనల గ్రంథము చాప్టర్ 41