- 1 యెహోవా రాజ్యము చేయుచున్నాడు ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించియున్నాడు యెహోవా బలముధరించి బలముతో నడుము కట్టు కొనియున్నాడు కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడియున్నది.
- 2 పురాతనకాలమునుండి నీ సింహాసనము స్థిరమాయెను సదాకాలము ఉన్నవాడవు నీవే
- 3 వరదలు ఎలుగెత్తెను యెహోవా, వరదలు ఎలుగెత్తెను వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి
- 4 విస్తారజలముల ఘోషలకంటెను బలమైన సముద్ర తరంగముల ఘోషలకంటెను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు
- 5 నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు యెహోవా, ఎన్న టెన్నటికి పరిశుద్ధతయే నీ మందిర మునకు అనుకూలము.
Psalms 093
- Details
- Parent Category: Old Testament
- Category: Psalms
కీర్తనల గ్రంథము చాప్టర్ 93