- 1 యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము...... నిలుచును ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి
- 2 ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందురు గాక.
- 3 ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశ స్థులు అందురు గాక.
- 4 ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులుగలవారు అందురు గాక.
- 5 ఇరుకునందుండి నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని విశాలస్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను
- 6 యెహోవా నా పక్షమున నున్నాడు నేను భయ పడను నరులు నాకేమి చేయగలరు?
- 7 యెహోవా నా పక్షము వహించి నాకు సహకారియై యున్నాడు నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను.
- 8 మనుష్యులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు.
- 9 రాజులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు.
- 10 అన్యజనులందరు నన్ను చుట్టుకొనియున్నారు యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము చేసెదను.
- 11 నలుదిశలను వారు నన్ను చుట్టుకొనియున్నారు యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము చేసెదను.
- 12 కందిరీగలవలె నామీద ముసిరి యున్నారు ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించి పోయిరి యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసెదను.
- 13 నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి యెహోవా నాకు సహాయము చేసెను.
- 14 యెహోవా నా దుర్గము నా గానము ఆయన నాకు రక్షణాధారమాయెను.
- 15 నీతిమంతుల గుడారములలోరక్షణనుగూర్చిన ఉత్సాహ సునాదము వినబడును యెహోవా దక్షిణహస్తము సాహస కార్యములను చేయును.
- 16 యెహోవా దక్షిణహస్తము మహోన్నత మాయెను యెహోవా దక్షిణహస్తము సాహసకార్యములను చేయును.
- 17 నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివ రించెదను.
- 18 యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు.
- 19 నేను వచ్చునట్లు నీతి గుమ్మములు తీయుడి నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించెదను.
- 20 ఇది యెహోవా గుమ్మము నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు.
- 21 నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి యున్నావు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను.
- 22 ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను.
- 23 అది యెహోవావలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము
- 24 ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము దీనియందు మనము ఉత్సహించి సంతోషించెదము.
- 25 యెహోవా, దయచేసి నన్ను రక్షించుము యెహోవా, దయచేసి అభివృద్ధి కలిగించుము.
- 26 యెహోవాపేరట వచ్చువాడు ఆశీర్వాద మొందును గాక యెహోవా మందిరములోనుండి మిమ్ము దీవించు చున్నాము.
- 27 యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు నను గ్రహించియున్నాడు ఉత్సవ బలిపశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి.
- 28 నీవు నా దేవుడవు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను నీవు నా దేవుడవు నిన్ను ఘనపరచెదను.
- 29 యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.
Psalms 118
- Details
- Parent Category: Old Testament
- Category: Psalms
కీర్తనల గ్రంథము చాప్టర్ 118