- 1 బబులోను నదులయొద్ద కూర్చుండియున్నప్పుడు మనము సీయోనును జ్ఞాపకము చేసికొని యేడ్చు చుంటిమి.
- 2 వాటిమధ్యనున్న నిరవంజిచెట్లకు మన సితారాలు తగి లించితివిు.
- 3 అచ్చట మనలను చెరగొన్నవారుఒక కీర్తనపాడుడి అనిరి మనలను బాధించినవారు సీయోను కీర్తనలలో ఒకదానిని మాకు వినిపించుడి అని మనవలన ఉల్లాసము గోరిరి
- 4 అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనమెట్లు పాడుదుము?
- 5 యెరూషలేమా, నేను నిన్ను మరచినయెడల నా కుడిచేయి తన నేర్పు మరచును గాక.
- 6 నేను నిన్ను జ్ఞాపకము చేసికొననియెడల, నా ముఖ్య సంతోషముకంటె నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచనియెడల నా నాలుక నా అంగిటికి అంటుకొనును గాక.
- 7 యెహోవా, ఎదోము జనులు చేసినది జ్ఞాపకము చేసి కొనుము యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకమునకు తెచ్చు కొనుము. దానిని నాశనముచేయుడి సమూలధ్వంసము చేయుడి అని వారు చాటిరి గదా.
- 8 పాడు చేయబడబోవు బబులోను కుమారీ, నీవు మాకు చేసిన క్రియలనుబట్టి నీకు ప్రతికారము చేయువాడు ధన్యుడు
- 9 నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకువేసి కొట్టు వాడు ధన్యుడు.
Psalms 137
- Details
- Parent Category: Old Testament
- Category: Psalms
కీర్తనల గ్రంథము చాప్టర్ 137