- 1 ఇందువలన, పరలోకసంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపొస్తలుడును ప్రధానయాజకుడునైన యేసుమీద లక్ష్యముంచుడి.
- 2 దేవుని యిల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు, ఈయనకూడ తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను.
- 3 ప్రతి యిల్లును ఎవడైన ఒకనిచేత కట్టబడును; సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటె దానిని కట్టిన వాడెక్కువ ఘనతపొందినట్టు,
- 4 ఈయన మోషేకంటె ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను.
- 5 ముందు చెప్పబోవు సంగతులకు సాక్ష్యార్థ ముగా మోషే పరిచారకుడైయుండి దేవుని యిల్లంతటిలో నమ్మకముగా ఉండెను.
- 6 అయితే క్రీస్తు కుమారుడైయుండి, ఆయన యింటిమీద నమ్మకముగా ఉన్నాడు; ధైర్యమును నిరీక్షణవలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినయెడల మనమే ఆయన యిల్లు.
- 7 మరియు పరి శుద్ధాత్మయిట్లు చెప్పుచున్నాడు.
- 8 నేడు మీరాయన శబ్దమును వినినయెడల, అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటివలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి.
- 9 నలువది సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి.
- 10 కావున నేను ఆ తరమువారివలన విసిగి వీరెల్లప్పుడును తమ హృదయాలోచనలలో తప్పిపోవుచున్నారు నా మార్గములను తెలిసికొనలేదు.
- 11 గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితిని.
- 12 సహోదరులారా, జీవముగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసములేని దుష్టహృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి.
- 13 నేడు మీరాయన శబ్దమును వినినయెడల, కోపము పుట్టించి నప్పటివలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనుక,
- 14 పాపమువలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లునేడు అనబడు సమయముండగానే, ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి.
- 15 ఏలయనగా మొదటనుండి మనకున్న దృఢ విశ్వాసము అంతముమట్టుకు గట్టిగా చేపట్టినయెడలనే క్రీస్తులో పాలివారమై యుందుము.
- 16 విని కోపము పుట్టించినవారెవరు? మోషేచేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చినవారందరే గదా
- 17 ఎవరిమీద నలువది ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసినవారి మీదనే గదా? వారి శవములు6 అరణ్యములో రాలి పోయెను.
- 18 తన విశ్రాంతిలో ప్రవేశింపరని యెవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైనవారినిగూర్చియే గదా
- 19 కాగా అవిశ్వాసముచేతనే వారు ప్రవేశింపలేక పోయిరని గ్రహించుచున్నాము.
Hebrews 03
- Details
- Parent Category: New Testament
- Category: Hebrews
హెబ్రీయులకు చాప్టర్ 3