- 1 దోచుకొనబడకపోయినను దోచుకొనుచుండు నీకు శ్రమ నిన్నెవరు వంచింపకపోయినను వంచించుచుండు నీకు శ్రమ నీవు దోచుకొనుట మానిన తరువాత నీవు దోచుకొన బడెదవు నీవు వంచించుట ముగించిన తరువాత జనులు నిన్ను వంచించెదరు.
- 2 యెహోవా, నీకొరకు కనిపెట్టుచున్నాము మాయందు కరుణించుమ్‌ు ఉదయకాలమున వారికి బాహువుగానుఆపత్కాలమున మాకు రక్షణాధారముగానుఉండుము.
- 3 మహాఘోషణ విని జనములు పారిపోవును నీవు లేచుటతోనే అన్యజనులు చెదరిపోవుదురు.
- 4 చీడపురుగులు కొట్టివేయునట్లు మీ సొమ్ము దోచ బడును మిడతలు ఎగిరిపడునట్లు శత్రువులు దానిమీద పడు దురు
- 5 యెహోవా మహా ఘనత నొందియున్నాడు ఆయన ఉన్నతస్థలమున నివసించుచు న్యాయముతోను నీతితోను సీయోనును నింపెను.
- 6 నీకాలములో నియమింపబడినది స్థిరముగా నుండును రక్షణ బాహుళ్యమును బుద్ధిజ్ఞానముల సమృద్ధియు కలుగును యెహోవా భయము వారికి ఐశ్వర్యము.
- 7 వారి శూరులు బయట రోదనము చేయుచున్నారు సమాధాన రాయబారులు ఘోరముగా ఏడ్చు చున్నారు.
- 8 రాజమార్గములు పాడైపోయెను త్రోవను నడచువారు లేకపోయిరి అష్షూరు నిబంధన మీరెను పట్టణములను అవమాన పరచెను నరులను తృణీకరించెను.
- 9 దేశము దుఃఖించి క్షీణించుచున్నది లెబానోను సిగ్గుపడి వాడిపోవుచున్నది షారోను ఎడారి ఆయెను బాషానును కర్మెలును తమ చెట్ల ఆకులను రాల్చుకొను చున్నవి.
- 10 యెహోవా ఇట్లనుకొనుచున్నాడు ఇప్పుడే లేచెదను ఇప్పుడే నన్ను గొప్పచేసికొనెదను. ఇప్పుడే నాకు ఘనత తెచ్చుకొనెదను.
- 11 మీరు పొట్టును గర్భము ధరించి కొయ్యకాలును కందురు. మీ ఊపిరియే అగ్నియైనట్టు మిమ్మును దహించి వేయు చున్నది.
- 12 జనములు కాలుచున్న సున్నపుబట్టీలవలెను నరకబడి అగ్నిలో కాల్చబడిన ముళ్లవలెను అగును.
- 13 దూరస్థులారా, ఆలకించుడి నేను చేసినదాని చూడుడి సమీపస్థులారా, నా పరాక్రమమును తెలిసికొనుడి.
- 14 సీయోనులోనున్న పాపులు దిగులుపడుచున్నారు వణకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింప గలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్నవాటితో నివ సించును?
- 15 నీతిని అనుసరించి నడచుచు యథార్థముగా మాట లాడుచు నిర్బంధనవలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండ తన చేతులను మలుపుకొని హత్య యను మాట వినకుండ చెవులు మూసికొని చెడుతనము చూడకుండ కన్నులు మూసికొనువాడు ఉన్నతస్థలమున నివసించును.
- 16 పర్వతములలోని శిలలు అతనికి కోటయగును తప్పక అతనికి ఆహారము దొరకును అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును.
- 17 అలంకరింపబడిన రాజును నీవు కన్నులార చూచె దవు బహు దూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కన బడును.
- 18 నీ హృదయము భయంకరమైనవాటినిబట్టి ధ్యానించును. జనసంఖ్య వ్రాయువాడెక్కడ ఉన్నాడు? తూచువాడెక్కడ ఉన్నాడు? బురుజులను లెక్కించువాడెక్కడ ఉన్నాడు?
- 19 నాగరికములేని ఆ జనమును గ్రహింపలేని గంభీరభాషయు నీకు తెలియని అన్య భాషయు పలుకు ఆ జనమును నీవికను చూడవు.
- 20 ఉత్సవకాలములలో మనము కూడుకొనుచున్న సీయోను పట్టణమును చూడుము నిమ్మళమైన కాపురముగాను తియ్యబడని గుడారముగాను నీ కన్నులు యెరూష లేమును చూచును దాని మేకులెన్నడును ఊడదీయబడవు దాని త్రాళ్లలో ఒక్కటియైనను తెగదు.
- 21 అచ్చట యెహోవా ప్రభావముగలవాడై మన పక్షముననుండును, అది విశాలమైన నదులును కాలువలును ఉన్న స్థలముగా ఉండును అందులో తెడ్ల ఓడ యేదియు నడువదు గొప్ప ఓడ అక్కడికి రాదు.
- 22 యెహోవా మనకు న్యాయాధిపతి యెహోవా మన శాసనకర్త యెహోవా మన రాజు ఆయన మనలను రక్షించును.
- 23 నీ ఓడత్రాళ్లు వదలిపోయెను ఓడవారు తమ కొయ్య అడుగును దిట్టపరచరు చాపను విప్పి పట్టరు కాగా విస్తారమైన దోపుడు సొమ్ము విభాగింపబడును కుంటివారే దోపుడుసొమ్ము పంచుకొందురు.
- 24 నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును.
Isaiah 33
- Details
- Parent Category: Old Testament
- Category: Isaiah
యెషయా గ్రంథము చాప్టర్ 33