- 1 నా ప్రాణము సమసిపోయెను నా దినములు తీరెను...సమాధి నా నిమిత్తము సిద్ధమైయున్నది.
- 2 ఎగతాళి చేయువారు నాయొద్ద చేరియున్నారువారు పుట్టించు వివాదములు నా కన్నుల కెదురుగానున్నవి.
- 3 ఏర్పాటు చేయుము దయచేసి నా నిమిత్తము నీ అంతట నీవే పూటపడుముమరి యెవడు నా నిమిత్తము పూటపడును?
- 4 నీవు వారి హృదయమునకు జ్ఞానము మరుగుచేసితివికావున నీవు వారిని హెచ్చింపవు.
- 5 ఎవడు తన స్నేహితులను దోపుసొమ్ముగా ఇచ్చునోవాని పిల్లల కన్నులు క్షీణించును.
- 6 ఆయన నన్ను జనులలో సామెతకాస్పదముగా చేసి యున్నాడునలుగురు నా ముఖముమీద ఉమి్మవేయుదురు.
- 7 నా కనుదృష్టి దుఃఖముచేత మందమాయెనునా అవయవములన్నియు నీడవలె ఆయెను
- 8 యథార్థవంతులు దీనినిచూచి ఆశ్చర్యపడుదురునిర్దోషులు భక్తిహీనుల స్థితి చూచి కలవరపడుదురు.
- 9 అయితే నీతిమంతులు తమ మార్గమును విడువకప్రవర్తించుదురునిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు.
- 10 మీరందరు నాయొద్దకు రండి, మరల దయచేయుడిమీలో జ్ఞానవంతు డొక్కడైనను నాకు కనబడడు.
- 11 నా దినములు గతించెనునా యోచన నిరర్థకమాయెనునా హృదయ వాంఛ భంగమాయెను.
- 12 రాత్రి పగలనియుచీకటి కమ్ముటయే వెలుగనియు వారు వాదించుచున్నారు.
- 13 ఆశ యేదైన నాకుండిన యెడల పాతాళము నాకుఇల్లు అను ఆశయే.చీకటిలో నా పక్క పరచుకొనుచున్నాను
- 14 నీవు నాకు తండ్రివని గోతితోనునీవు నాకు తల్లివని చెల్లెలవని పురుగుతోను నేనుమనవి చేయుచున్నాను.
- 15 నాకు నిరీక్షణాధారమేది?నా నిరీక్షణ యెవనికి కనబడును?
- 16 ధూళిలో విశ్రాంతి దొరకగా అది పాతాళపు అడ్డకమ్ములయొద్దకు దిగుచున్నది.
Job 17
- Details
- Parent Category: Old Testament
- Category: Job
యోబు గ్రంథము చాప్టర్ 17