- 1 అప్పుడు షూహీయుడైన బిల్దదు ఈలాగు ప్రత్యుత్తర మిచ్చెను
- 2 మాటలలో చిక్కుపరచుటకై మీ రెంతసేవు వెదకుదురు?మీరు ఆలోచన చేసి ముగించినయెడల మేము మాట లాడెదము.
- 3 మీ దృష్టికి మృగములుగానుమూఢులుగాను మేమెంచబడుట ఏల?
- 4 కోపముచేత నిన్ను నీవు చీల్చుకొనువాడా,నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడునా?నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పునా?
- 5 భక్తిహీనుల దీపము ఆర్పివేయబడునువారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును.
- 6 వారి గుడారములో వెలుగు అంధకారమగునువారియొద్దనున్న దీపము ఆరిపోవును
- 7 వారి పటుత్వముగల నడకలు అడ్డగింపబడునువారి స్వకీయాలోచన వారిని కూల్చును.
- 8 వారు వాగురలమీద నడచువారు తమ కాళ్లే వారిని వలలోనికి నడిపించును.
- 9 బోను వారి మడిమెను పట్టుకొనునువల వారిని చిక్కించుకొనును.
- 10 వారిని చిక్కించుకొనుటకై ఉరి నేలను ఉంచబడునువారిని పట్టుకొనుటకై త్రోవలో ఉచ్చు పెట్టబడును.
- 11 నలుదిక్కుల భీకరమైనవి వారికి భయము కలుగజేయునుభయములు వారిని వెంటాడి తరుమును.
- 12 వారి బలము క్షీణించిపోవునువారిని కూల్చుటకు ఆపద కాచియుండును.
- 13 అది వారి దేహ అవయవములను భక్షించునుమరణజ్యేష్ఠుడు వారి అవయవములను భక్షించును.
- 14 వారి ఆశ్రయమైన వారి గుడారములోనుండి పెరికివేయబడుదురువారు భీకరుడగు రాజునొద్దకు కొనిపోబడుదురు.
- 15 వారికి అన్యులైనవారు వారి గుడారములో నివాసము చేయుదురువారి నివాసస్థలముమీద గంధకము చల్లబడును.
- 16 క్రింద వారి వేళ్లు ఎండిపోవునుపైన వారి కొమ్మలు నరకబడును.
- 17 భూమిమీద ఎవరును వారిని జ్ఞాపకము చేసికొనరుమైదానమందు ఎక్కడను వారిని ఎరిగినవారు ఉండరు.
- 18 జనులు వారిని వెలుగులోనుండి చీకటిలోనికి తోలుదురుభూలోకములోనుండి వారిని తరుముదురు.
- 19 వారి ప్రజలలో వారికి పుత్రులైనను పౌత్రులైననుఉండరువారు నివసించిన స్థలములో తప్పించుకొనినవాడుఒకడైనను ఉండడు.
- 20 తర్వాత వచ్చినవారు వారిమీద పడిన శిక్షనుచూచివిస్మయమొందుదురుపూర్వముండినవారు దానిని చూచి దిగులుపడుదురు.
- 21 నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతి పట్టునుదేవుని ఎరుగనివారి స్థలము ఇట్టిది.
Job 18
- Details
- Parent Category: Old Testament
- Category: Job
యోబు గ్రంథము చాప్టర్ 18