- 1 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెనునీవు ఇశ్రాయేలీయులతో
- 2 కనాను దేశమున, అనగా పొలిమేరలచొప్పున మీరు చీట్లువేసి స్వాస్థ్యముగా పంచుకొను కనానుదేశమున
- 3 మీరు ప్రవేశించుచుండగా, మీ దక్షిణదిక్కు సీను అరణ్యము మొదలుకొని ఎదోము సరిహద్దు, అనగా
- 4 మీ దక్షిణపు సరిహద్దు ఉప్పు సము ద్రముయొక్క తూర్పు తీరమువరకు ఉండును. మీ సరి హద్దు దక్షిణము మొదలుకొని అక్రబ్బీము కనమయొద్ద తిరిగి సీనువరకు వ్యాపించును. అది దక్షిణమునుండి కాదేషు బర్నేయవరకు వ్యాపించి, అక్కడనుండి హసరద్దారువరకు పోయి, అక్కడనుండి అస్మోనువరకు సాగును.
- 5 అస్మోనునుండి ఐగుప్తు నదివరకు సరిహద్దు తిరిగి సముద్రమువరకు వ్యాపించును.
- 6 పడమటి సరిహద్దు ఏద నగా మహాసముద్రము, అదే మీకు పడమటి సరిహద్దుగా నుండును.
- 7 మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రము యొద్దనుండి హోరు కొండవరకు ఏర్పరచుకొనవలెను.
- 8 హోరు కొండ యొద్దనుండి హమాతునకు పోవుమార్గము వరకు ఏర్పరచుకొనవలెను. ఆ సరిహద్దు సెదాదువరకు వ్యాపించును.
- 9 అక్కడనుండి సరిహద్దు జిప్రోనువరకు వ్యాపించును, దాని చివర హసరేనానునొద్ద ఉండును. అది మీకు ఉత్తరపు సరిహద్దు.
- 10 తూర్పు సరిహద్దు హసరేనానునుండి షెపామువరకు మీరు ఏర్పరచుకొన వలెను.
- 11 షెపామునుండి సరిహద్దు అయీనుకు తూర్పున రిబ్లావరకు నుండును. ఆ సరిహద్దు దిగి తూర్పున కిన్నె రెతు సముద్రమునొడ్డును తగిలియుండును.
- 12 ఆ సరిహద్దు యొర్దానునదివరకు దిగి ఉప్పు సముద్రముదనుక వ్యాపిం చును. ఆదేశము చుట్టునున్న సరిహద్దుల మధ్యనున్న దేశము మీదై యుండునని వారి కాజ్ఞాపించుము.
- 13 మోషే ఇశ్రాయేలీయులతోమీరు చీట్లచేత పొంద బోవుచున్న దేశము ఇది. యెహోవా తొమి్మది గోత్ర ములకును అర్ధగోత్రమునకును దీని నియ్యవలెనని ఆజ్ఞా పించెను;
- 14 ఏలయనగా తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము రూబేనీయులును గాదీయులును తమ తమ స్వాస్థ్యముల నొందిరి.
- 15 మనష్షే అర్ధగోత్రపువారు తమ స్వాస్థ్యము నొందిరి. ఆ రెండు గోత్రపువారును అర్ధ గోత్రపువారును సూర్యోదయ దిక్కున, అనగా తూర్పు దిక్కున యెరికోయొద్ద యొర్దాను ఇవతల తమ తమ స్వాస్థ్యములను పొందిరని చెప్పెను.
- 16 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను
- 17 ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టవలసినవా రెవరనగా, యాజకుడైన ఎలియాజరును నూను కుమారు డైన యెహోషువయు.
- 18 మరియు ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టుటకు ప్రతి గోత్రములో ఒక్కొక ప్రధానుని ఏర్పరచుకొనవలెను.
- 19 వారెవ రనగా, యూదావారి గోత్రములో యెఫున్నె కుమారు డైన కాలేబు.
- 20 షిమ్యోనీయుల గోత్రములో అమీహూదు కుమారుడైన షెమూయేలు,
- 21 బెన్యామీనీయుల గోత్ర ములో కిస్లోను కుమారుడైన ఎలీదాదు.
- 22 దానీయుల గోత్రములో యొగ్లి కుమారుడైన బుక్కీ ప్రధాని,
- 23 యోసేపు పుత్రులలో ఏఫోదు కుమారుడైన హన్నీయేలు మనష్షీయుల గోత్రప్రధాని,
- 24 ఎఫ్రాయిమీయుల గోత్ర ములో షిప్తాను కుమారుడైన కెమూయేలు ప్రధాని,
- 25 జెబూలూనీయుల గోత్రములో పర్నాకు కుమారుడైన ఎలీషాపాను ప్రధాని,
- 26 ఇశ్శాఖారీయుల గోత్రములో అజాను కుమారుడైన పల్తీయేలు ప్రధాని,
- 27 ఆషేరీయుల గోత్రములో షెలోమి కుమారుడైన అహీహూదు ప్రధాని.
- 28 నఫ్తాలీయుల గోత్రములో అమీహూదు కుమారుడైన పెదహేలు ప్రధాని.
- 29 కనాను దేశములో ఇశ్రాయేలీయులకు వారి వారి స్వాస్థ్యములను పంచిపెట్టు టకు యెహోవా ఆజ్ఞాపించినవారు వీరే.
Numbers 34
- Details
- Parent Category: Old Testament
- Category: Numbers
సంఖ్యాకాండము చాప్టర్ 34