- 1 మరియు యెరికో యొద్ద యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను
- 2 ఇశ్రాయేలీయులు తాము పొందు స్వాస్థ్యములో లేవీయులు నివసించుటకు వారికి పురములను ఇయ్యవలెనని వారి కాజ్ఞాపించుము; ఆ పుర ముల చుట్టునున్న పల్లెలను లేవీయులకియ్యవలెను.
- 3 వారు నివసించుటకు ఆ పురములు వారివగును. వాటి పొలములు వారి పశువులకును వారి మందలకును వారి సమస్త జంతు వులకును ఉండవలెను.
- 4 మీరు లేవీయులకిచ్చు పురముల పల్లెల ప్రతి పురముయొక్క గోడ మొదలుకొని చుట్టు వెయ్యి మూరలు
- 5 మరియు మీరు ఆ పురముల వెలుపల నుండి తూర్పు దిక్కున రెండువేల మూరలను, దక్షిణ దిక్కున రెండువేల మూరలను, పడమటి దిక్కున రెండు వేల మూరలను, ఉత్తర దిక్కున రెండువేల మూరలను కొలవవలెను. ఆ నడుమ పురముండవలెను. అది వారి పురములకు పల్లెలుగా నుండును.
- 6 మరియు మీరు లేవీ యులకిచ్చు పురములలో ఆరు ఆశ్రయపురములుండవలెను. నరహంతుకుడు వాటిలోనికి పారిపోవునట్లుగా వాటిని నియమింపవలెను. అవియుగాక నలువదిరెండు పురములను ఇయ్యవలెను.
- 7 వాటి వాటి పల్లెలతోకూడ మీరు లేవీయులకు ఇయ్యవలసిన పురములన్నియు నలువదియెని మిది.
- 8 మీరు ఇచ్చు పురములు ఇశ్రాయేలీయుల స్వాస్థ్య ములో నుండియే ఇయ్యవలెను. మీరు ఎక్కువైనదానిలో ఎక్కువగాను, తక్కువైనదానిలో తక్కువగాను ఇయ్యవలెను. ప్రతి గోత్రము తాను పొందు స్వాస్థ్యము చొప్పున, తన తన పురములలో కొన్నిటిని లేవీయులకు ఇయ్య వలెను.
- 9 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము
- 10 మీరు యొర్దాను దాటి కనానుదేశములోనికి వెళ్లిన తరువాత
- 11 ఆశ్రయ పురములుగా ఉండుటకు మీరు పురములను ఏర్పరచుకొన వలెను.
- 12 పొరబాటున ఒకని చంపినవాడు వాటిలోనికి పారిపోవచ్చును. తీర్పు పొందుటకై నరహంతకుడు సమాజమునెదుట నిలుచువరకు వాడు మరణశిక్ష నొందకూడదు గనుక ప్రతిహత్య చేయువాడు రాకుండ అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును.
- 13 మీరు ఇయ్య వలసిన ఆ పురములలో ఆరు ఆశ్రయ పురములుండవలెను.
- 14 వాటిలో యొర్దాను ఇవతల మూడు పురములను ఇయ్య వలెను, కనాను దేశములో మూడు పురములను ఇయ్య వలెను. అవి మీకు ఆశ్రయ పురములుగా ఉండును.
- 15 పొరబాటున ఒకని చంపిన యెవడైనను వాటిలోనికి పారి పోవునట్లు ఆ ఆరు పురములు ఇశ్రాయేలీయులకును పర దేశులకును మీ మధ్య నివసించువారికిని ఆశ్రయమై యుండును.
- 16 ఒకడు చచ్చునట్లు వానిని ఇనుప ఆయుధ ముతో కొట్టువాడు నరహంతకుడు ఆ నరహంతకునికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను.
- 17 ఒకడు చచ్చు నట్లు మరియొకడు రాతితో వాని కొట్టగా దెబ్బతినిన వాడు చనిపోయినయెడల కొట్టినవాడు నరహంతకుడగును. ఆ నరహంతకుడు నిశ్చయముగా మరణశిక్ష నొందును.
- 18 మరియు ఒకడు చచ్చునట్లు మరియొకడు చేతికఱ్ఱతో కొట్టగా దెబ్బ తినినవాడు చనిపోయిన యెడల కొట్టిన వాడు నర హంతకుడగును. ఆ నరహంత కుడు నిశ్చయముగా మరణశిక్ష నొందును.
- 19 హత్య విషయములో ప్రతిహత్య చేయువాడు తానే నరహంత కుని చంపవలెను.
- 20 వాని కనుగొనినప్పుడు వాని చంప వలెను. ఒకడు చచ్చునట్లు వాని పగపట్టి పొడిచినను, లేక పొంచియుండి వానిమీద దేనినైనను వేసినను, లేక ఒకడు చచ్చునట్లు వైరమువలన చేతితో వాని కొట్టినను, కొట్టినవాడు నరహంతకుడు, నిశ్చయముగా వాని చంప వలెను.
- 21 నరహత్య విషయములో ప్రతిహత్య చేయు వాడు ఆ నరహంతకుని కనుగొనినప్పుడు వాని చంపవలెను.
- 22 అయితే పగపట్టక హఠాత్తుగా వానిని పొడిచి నను, పొంచియుండక వానిమీద ఏ ఆయుధమునైన వేసినను, వాని చూడక ఒకడు చచ్చునట్లు వానిమీద రాయి పడవేసినను,
- 23 దెబ్బతినినవాడు చనిపోయిన యెడల కొట్టిన వాడు వానిమీద పగపట్టలేదు, వానికి హానిచేయ గోరలేదు.
- 24 కాబట్టి సమాజము ఈ విధులనుబట్టి కొట్టిన వానికిని హత్యవిషయములో ప్రతిహత్య చేయువానికిని తీర్పుతీర్చవలెను.
- 25 అట్లు సమాజము నరహత్య విషయ ములో ప్రతిహత్య చేయువాని చేతిలోనుండి ఆ నరహంత కుని విడిపింపవలెను. అప్పుడు సమాజము వాడు పారి పోయిన ఆశ్రయ పురమునకు వాని మరల పంపవలెను. వాడు పరిశుద్ధ తైలముతో అభిషేకింపబడిన ప్రధాన యాజకుడు మృతినొందువరకు అక్కడనే నివసింపవలెను.
- 26 అయితే ఆ నరహంతకుడు ఎప్పుడైనను తాను పారిపోయి చొచ్చిన ఆశ్రయపురముయొక్క సరిహద్దును దాటి వెళ్లు నప్పుడు
- 27 నరహత్యవిషయములో ప్రతిహత్య చేయువాడు ఆశ్రయపురముయొక్క సరిహద్దు వెలుపల వాని కను గొనినయెడల, ఆ ప్రతిహంతకుడు ఆ నరహంతకుని చంపి నను వానిమీద ప్రాణముతీసిన దోషము ఉండదు.
- 28 ఏలయనగా ప్రధానయాజకుడు మృతినొందువరకు అతడు ఆశ్రయపురములోనే నివసింపవలెను. ప్రధానయాజకుడు మృతినొందిన తరువాత ఆ నరహంతకుడు తన స్వాస్థ్యమున్న దేశము నకు తిరిగి వెళ్లవచ్చును.
- 29 ఇవి మీ సమస్త నివాసస్థలము లలో మీ తరతరములకు మీకు విధింపబడిన కట్టడ.
- 30 ఎవడైనను ఒకని చావగొట్టిన యెడల సాక్షుల నోటిమాట వలన ఆ నరహంతకునికి మరణశిక్ష విధింపవలెను. ఒక సాక్షిమాటమీదనే యెవనికిని మరణశిక్ష విధింప కూడదు.
- 31 చావతగిన నరహంతకుని ప్రాణముకొరకు మీరు విమోచన ధనమును అంగీకరింపక నిశ్చయముగా వానికి మరణశిక్ష విధింపవలెను.
- 32 మరియు ఆశ్రయపుర మునకు పారిపోయినవాడు యాజకుడు మృతినొందక మునుపు స్వదేశమందు నివసించునట్లు వానిచేత విమోచన ధనమును అంగీకరింపకూడదు.
- 33 మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు; నరహత్య దేశమును అపవిత్రపర చును గదా. దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తమువలననే ప్రాయశ్చిత్తము కలుగును గాని మరి దేనివలనను కలుగదు.
- 34 మీరు నివసించు దేశ మును అపవిత్ర పరచకూడదు. అందులో నేను మీ మధ్యను నివసించుచున్నాను. నిజముగా యెహోవా అను నేను ఇశ్రాయేలీయులమధ్య నివసించుచున్నాను.
Numbers 35
- Details
- Parent Category: Old Testament
- Category: Numbers
సంఖ్యాకాండము చాప్టర్ 35