- 1 భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తివలె పలుకుచున్నదివాని దృష్టియెదుట దేవుని భయము బొత్తిగాలేదు.
- 2 వాని దోషము బయలుపడి అసహ్యముగాకనబడు వరకు అది వాని దృష్టియెదుట వాని ముఖస్తుతి చేయు చున్నది.
- 3 వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు బుద్ధిగలిగి ప్రవర్తింపను మేలుచేయను వాడు మానివేసి యున్నాడు.
- 4 వాడు మంచముమీదనే పాపయోచనను యోచిం చును వాడు కానినడతలు నడచువాడు చెడుతనము వానికి అసహ్యము కాదు.
- 5 యెహోవా, నీ కృప ఆకాశము నంటుచున్నది నీ సత్యసంధత్వము అంతరిక్షము నంటుచున్నది.
- 6 నీ నీతి దేవుని పర్వతములతో సమానము నీ న్యాయవిధులు మహాగాధములు. యెహోవా, నరులను జంతువులను రక్షించువాడవు నీవే
- 7 దేవా, నీ కృప యెంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు.
- 8 నీ మందిరముయొక్క సమృద్ధివలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనందప్రవాహములోనిది నీవు వారికి త్రాగించు చున్నావు.
- 9 నీయొద్ద జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచు చున్నాము.
- 10 నిన్ను ఎరిగినవారియెడల నీ కృపను యథార్థహృదయులయెడల నీ నీతిని ఎడతెగక నిలు పుము.
- 11 గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియ్యకుము భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనియ్యకుము.
- 12 అదిగో పాపముచేయువారు అక్కడ పడియున్నారు లేవలేకుండ వారు పడద్రోయబడి యున్నారు.
Psalms 036
- Details
- Parent Category: Old Testament
- Category: Psalms
కీర్తనల గ్రంథము చాప్టర్ 36